గుంటూరు జిల్లా తెనాలి సబ్ డివిజన్ పరిధిలో ఆధునికీకరణ చేసిన పోలీస్ స్టేషన్లను... తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, వేమూరు ఎమ్మెల్యే మేరుగు నాగార్జున, గుంటూరు గ్రామీణ ఎస్పీ విశాల్ గున్నీ కలసి ప్రారంభించారు.
ప్రజలకు రక్షణ కల్పించి, వారి సమస్యలు తీర్చడంలో పోలీస్ స్టేషన్లు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయని వారు అన్నారు. కరోనా వైరస్ కట్టడిలో, అనేకమైన క్లిష్ట సమయాల్లో పగలు రాత్రి అహర్నిశలు కష్టపడుతూ విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులు, సిబ్బందికి కావలసిన విశ్రాంతి గదుల వంటి సౌకర్యాలు పోలీస్ స్టేషన్లలో కల్పించడం జరిగిందన్నారు.
ఇదీ చదవండి: