తల్లి ఒడిలో ఆడుకోవాల్సిన చిన్నారి ముళ్లపొదల్లో కనిపించాడు. ఊయలలో నిద్రించాల్సిన చిన్నారి కంపచెట్ల మధ్య ఏడుస్తూ ఉన్నాడు. పుట్టిన గంటల వ్యవధిలోనే చిన్నారి ఇలా ముళ్లపొదల పాలైన ఘటన... గుంటూరు జిల్లాలో జరిగింది.
గుంటూరు గుజ్జనగుండ్ల సాయిబాబు నగర్లో అప్పుడే పుట్టిన శిశివును ముళ్ల పొదల్లో గుర్తు తెలియని వ్యక్తులు వదిలేసి వెళ్లారు. అటుగా వెళుతున్న స్థానికులు శిశువు ఏడుపు విని అమ్మ చారిటబుల్ ట్రస్ట్ కు సమాచారం ఇచ్చారు. ట్రస్ట్ నిర్వాహకులు ఘటనా స్థలానికి చేరుకొని శిశువును అక్కున చేర్చుకుని.. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రేగు కత్తిరించి శిశువుకు వైద్యం అందిస్తున్నట్లు వెద్యులు చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసిన పట్టాభిపురం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:
నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలంటూ.. టీఎన్ఎస్ వినూత్న నిరసన