సుప్రీం కోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ ఎన్.వి. రమణకు నాగార్జున విశ్వవిద్యాలయం లా కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం అభినందనలు తెలిపింది. నాగార్జున వర్సటీ లా కళాశాల విద్యార్థులతో పాటు తెలుగువారందరికీ జస్టిస్ రమణ గర్వకారణమని పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు నర్రా శ్రీనివాస్ అన్నారు.
ఇక్కడ విద్యాభ్యాసం పూర్తి చేసిన వ్యక్తి.. న్యాయవ్యవస్థలో దేశ అత్యున్నత పీఠాన్ని అధిరోహించటం తమకు సంతోషంగా ఉందని చెప్పారు. హైకోర్టులో, సుప్రీంకోర్టులో జస్టిస్ రమణ కీలక తీర్పులు వెలువరించారని గుర్తు చేశారు. భవిష్యత్తులోనూ మరిన్ని ముఖ్యమైన తీర్పులివ్వాలని.. న్యాయపాలనలో మరిన్ని సంస్కరణలు తీసుకురావాలని ఆకాంక్షించారు.
ఇదీ చదవండి: