ETV Bharat / state

'జగనన్న చేదోడు పథకం రుణాలకు ప్రభుత్వమే వడ్డీ చెల్లిస్తుంది' - జగనన్న తోడు పథకం

జగనన్న చేదోడు పథకం ద్వారా ఇచ్చే రుణాలకు ప్రభుత్వమే వడ్డీ చెల్లిస్తుందని నరసరావుపేట మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి అన్నారు. స్థానిక మున్సిపల్ గెస్ట్ హౌస్​లో బ్యాంకర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సంక్షేమ పథకాలకు నిధుల మంజూరు గురించి చర్చించారు.

ommissioner meeting with bankers
జగనన్న తోడు పథకం రుణాలకు ప్రభుత్వమే వడ్డీ చెల్లిస్తుంది
author img

By

Published : Nov 10, 2020, 10:06 PM IST

గుంటూరు జిల్లా నరసరావుపేట మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి బ్యాంకు మేనేజర్లతో సమావేశం నిర్వహించారు. స్థానిక మున్సిపల్ గెస్ట్ హౌస్​లో జరిగిన సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెటిన జగనన్న చేదోడు, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ బీమా, హౌసింగ్ పథకాల అమలుపై చర్చించారు. జగనన్న చేదోడు పథకం ద్వారా వీధి వ్యాపారులు, చిరువ్యాపారులకు బ్యాంకుల ద్వారా 10వేల రూపాయల రుణాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఆ రుణాలకు ప్రభుత్వమే వడ్డీ చెల్లిస్తుందని తెలిపారు.

జగనన్న చేదోడు పథకానికి ఇప్పటివరకు 5 వేల దరఖాస్తులు వచ్చాయన్నారు. వాటితో పాటు మిగిలిన పథకాలకు అందిన దరఖాస్తులను బ్యాంకు మేనేజర్లకు అందజేశామని కమిషనర్ తెలిపారు. అదేవిధంగా బ్యాంక్ మేనేజర్లు అప్లికేషన్​లను త్వరగా పరిశీలించి లబ్ధిదారులకు నిధులు మంజూరు చేయాలని సమావేశంలో కోరినట్లు ఆయన తెలిపారు.

ఇదీ చూడండి: 'బీసీలంటే వెన్నెముక వర్గాలుగా చూసే రోజులొచ్చాయి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.