వైకాపా ప్రభుత్వం పేద ప్రజల కోసం అమలు చేస్తున్న పథకాలు పేదలందరికీ అందుతాయని, వాటి కోసం ఎవరికీ డబ్బులు ఇవ్వొద్దని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలన్నీ ప్రజలకు ఉచితంగానే ఇస్తుందని అన్నారు. వైకాపా ప్రభుత్వం నవరత్నాల్లో భాగంగా పేదలకు ఇళ్లస్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. గుంటూరు జిల్లాలోని నరసరావుపేటలోని వైకాపా కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడారు
18,000 మందికి...
నరసరావుపేట నియోజకవర్గంలో మొత్తం 18,000 మంది పేదలకు ఇళ్లస్థలాలు, టిడ్కో ఇళ్లు అందిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. వీటన్నింటినీ జనవరి 7వ తేదీ నాటికి పేదలకు అందిస్తామన్నారు. వాటిలో నరసరావుపేట పట్టణంలోని ప్రజలకు సుమారు 8,165 పట్టాలు ఇస్తామని తెలిపారు. నరసరావుపేట పట్టణ పరిధిలోని ప్రజలకు జనవరి 3వ తేదీన ఇళ్ల స్థలాల పంపిణీ జరుగుతుందన్నారు. కార్యక్రమానికి జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీ రంగనాధరాజు, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్, గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్, నరసరావుపేట సబ్ కలెక్టర్ శ్రీవాస్ నుపూర్ పాల్గొంటారన్నారు.
90 రోజుల్లో :
నరసరావుపేట పట్టణ పరిధిలో ఇళ్లస్థలాలకు అర్హులైన పేద ప్రజలు ఉప్పలపాడు వద్ద ఏర్పాటు చేసిన ఇళ్లస్థలాల పంపిణీ కార్యక్రమానికి జనవరి 3వ తేదీన రావాలని నరసరావుపేట ఎమ్మెల్యే కోరారు.అర్హులై ఉండి ఇల్లు రాని పేద ప్రజలు ఎవరైనా ఉంటే సచివాలయంలో దరఖాస్తు చేసుకుంటే 90 రోజుల్లో ప్రభుత్వం వారికి ఇళ్లస్థలాలు కల్పిస్తుందని తెలిపారు.
ప్రభుత్వ పథకాలకు మధ్యవర్తులు ఎవరైనా డబ్బులడిగితే 9705222601, 7901677063 నెంబర్లకు పిర్యాదు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వివరించారు.
ఇదీ చదవండి :