ETV Bharat / state

నరసరావుపేటలో రేపటినుంచి లాక్ డౌన్ సడలింపులు

గుంటూరు జిల్లా నరసరావుపేటలో రేపటి నుంచి లాక్ డౌన్​లో సడలింపులు చేయనున్నారు. పట్టణాన్ని రెండు భాగాలుగా విభజించి నిత్యావసరాల కోసం నిర్ణీత సమయంలో ప్రజలు బయటకు వచ్చేలా ఏర్పాటు చేస్తామని ఆర్డీఓ తెలిపారు.

narasaraopet lockdown relaxation from may 18
నరసరావుపేట ఆర్డీఓ వెంకటేశ్వర్లు
author img

By

Published : May 17, 2020, 8:43 PM IST

గుంటూరు జిల్లా నరసరావుపేటలో రేపటినుంచి లాక్ డౌన్​లో సడలింపులు చేయనున్నట్లు ఆర్డీఓ మొగిలి వెంకటేశ్వర్లు తెలిపారు. పట్టణంలోని వార్డులను 2 భాగాలుగా విభజించి ఆయా వార్డులకు రోజు మార్చి రోజు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకూ ప్రజలు నిత్యావసరాల కోసం బయటకు వచ్చే అవకాశం కల్పిస్తామని చెప్పారు. 6వ వార్డు నుంచి 24వ వార్డు వరకు ఒక భాగం కాగా.. 1 నుంచి 5, 25 నుంచి 34 వార్డుల వరకూ 2వ భాగంగా నిర్ణయించామన్నారు.

ఒకటవ భాగం ప్రజలు 18వ తేదీ, రెండో భాగం ప్రజలు 19వ తేదీ నిత్యావసరాలకు బయటకు రావాలని ఆయన కోరారు. ఇలా 4 రోజులు ఉంటుందని ఆ తరువాత లాక్ డౌన్ సడలింపుపై మరలా వివరణ ఇస్తామని ఆర్డీఓ తెలిపారు. క్లస్టర్ జోన్లలోని ప్రజలకు లాక్ డౌన్ సడలింపు లేదని ఆయా వార్డుల్లోని ప్రజలకు ఎప్పటిలాగే నిత్యావసరాలు ఇళ్లకే పంపుతామని అన్నారు.

ఇవీ చదవండి.. 'ప్రభుత్వం అతనికి క్షమాపణ చెప్పాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.