nara lokesh letter to cm jagan: కరోనా కేసులు పెరుగుతున్న పరిస్థితుల్లో విద్యాసంస్థల సెలవులు పొడిగించాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాశారు. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాయని గుర్తు చేశారు. ఈ మేరకు తక్షణమే ఉత్తర్వులు ఇవ్వాలన్నారు.
-
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విద్యాసంస్థల సెలవులు పొడిగించాలని ముఖ్యమంత్రి @ysjagan గారికి లేఖ రాసాను. దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాలు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాయి.
— Lokesh Nara (@naralokesh) January 17, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు రెండు వారాల పాటు స్కూల్స్ కి సెలవులు ప్రకటించాయి.(1/2) pic.twitter.com/iCWaMJiPOt
">కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విద్యాసంస్థల సెలవులు పొడిగించాలని ముఖ్యమంత్రి @ysjagan గారికి లేఖ రాసాను. దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాలు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాయి.
— Lokesh Nara (@naralokesh) January 17, 2022
తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు రెండు వారాల పాటు స్కూల్స్ కి సెలవులు ప్రకటించాయి.(1/2) pic.twitter.com/iCWaMJiPOtకరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విద్యాసంస్థల సెలవులు పొడిగించాలని ముఖ్యమంత్రి @ysjagan గారికి లేఖ రాసాను. దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాలు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాయి.
— Lokesh Nara (@naralokesh) January 17, 2022
తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు రెండు వారాల పాటు స్కూల్స్ కి సెలవులు ప్రకటించాయి.(1/2) pic.twitter.com/iCWaMJiPOt
15 ఏళ్ల లోపు పిల్లలకు ఇంకా వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదన్న లోకేశ్.. విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్ల ప్రాణాలతో చెలగాటమాడోద్దని హితవు పలికారు. గత పది రోజుల్లో ఏపీలో కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిందని, గడిచిన పది రోజుల్లోనే రోజుకి 500 కేసుల నుండి 5 వేల కేసులు నమోదు అయ్యే పరిస్థితి నెలకొందన్నారు. ఈ సమయంలో స్కూల్స్ ప్రారంభించడం పెను ప్రమాదంగా మారే అవకాశం ఉందని లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. తల్లిదండ్రులను మరింత మానసిక ఆందోళనకు గురి చేయకుండా ప్రభుత్వం తక్షణమే విద్యాసంస్థలకు సెలవులు పొడిగించాలని కోరారు. తక్షణమే స్కూల్స్‌కి సెలవులు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని లోకేశ్ డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:
MP RRR Letter to CID: అనారోగ్యం వల్ల విచారణకు హాజరుకాలేను: ఎంపీ రఘురామ