ప్రముఖ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు తెదేపా అధినేత చంద్రబాబు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. "తెలుగు సినీనటులుగా అశేష ప్రేక్షకాభిమానాన్ని సంపాదించి, విశిష్ట వ్యక్తిత్వంతో, ప్రజల పక్షాన నిలిచి సేవలందిస్తోన్న జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు శతాయుష్కులై, సంపూర్ణ ఆనందారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాను" అని ట్విట్టర్ లో పోస్టు చేశారు. గతంలో జనసేనానితో కలిసి ఉన్న ఫొటోను ట్విట్టర్ లో పంచుకున్నారు.
ఇదీ చదవండి : మొక్క జొన్న కంకిలో గణపయ్య...ఆనందానికి అవధులు లేవయ్యా