Nakka Anand Babu Fired on AP CM Jagan: జగన్ నమ్మకద్రోహానికి హద్దులు లేవని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్ బాబు ధ్వజమెత్తారు. జగన్ కు విశ్వసనీయతకు అర్థం తెలియదని మండిపడ్డారు. జగన్ సమావేశాలంటేనే జనం బెంబేలెత్తుతూ, ఛీత్కరించుకుంటున్నారని దుయ్యబట్టారు. ఎత్తుకొని పెంచిన చిన్నాన్న పట్ల జగన్ వ్యవహార శైలి అందరికీ తెలిసిందేనని ఆక్షేపించారు. శంఖుస్థాపన చేసిన కడప స్టీల్ ఫ్యాక్టరీ పునాదిరాయికే పరిమితమైందని ఆగ్రహం వ్యక్తంచేశారు. సొంత తల్లికి, చెల్లికి ద్రోహం చేసిన వ్యక్తి జగన్ అని విమర్శించారు. కేవీపీ రామచంద్ర, సూరీడు తదితరులు కనుమరుగుకు జగన్ కారణమని ఆరోపించారు. జగన్ ను నమ్ముకొని ఐదారు అమరావతి కేసుల్లో ఇరుక్కొని జగన్ ప్రాపకం కోసం వెంపర్లాడిన ఆళ్ల రామకృష్ణారెడ్డిని తరిమేశారని గుర్తుచేశారు. గతంలో వైసీపీ నేతలే ప్రశాంత్ కిశోర్ ఎటువైపు వెళ్తే అటువైపు గెలుస్తారని అన్నారని, తాజాగా సీఎం జగన్ను గెలవడని తెలిసే ప్రశాంత్ కిశోర్ టీడీపీ వైపు వచ్చారని నక్కా పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయమని పేర్కొన్నారు.
జగన్ నిర్లక్ష్యం రాష్ట్ర ప్రజలకు అన్యాయం: జగన్ను నమ్మివెంట వచ్చిన వారిని బలిపెట్టే స్వభావం అని నక్కా ఆనంద్ బాబు విమర్శించారు. విశ్వసనీయత అని మాట్లాడే జగన్కు ఏమాత్రం విశ్వసనీయత లేదని నక్కా ఆరోపించారు. తన సొంత బాబాయిని చంపిన వారు జైలుకు వెళ్లకుండా సీఎం జగన్ రక్షిస్తున్నారని ఆనంద్ బాబు ఆరోపించారు. జగన్ నిర్లక్ష్యం వల్లే నీటి విషయంలో రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరిగిందని, కృష్ణా, తుంగభద్ర జలాల విషయంలో రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. జగన్ను నమ్ముకొని జైలుకు వెళ్లిన మోపిదేవి వేంకటరమణకు టిక్కెట్ లేదని, జగన్ కోసం రాజధానికి అన్యాయం చేసిన ఆళ్ల రామకృష్ణారెడ్డి టిక్కెట్ ఇవ్వలేదని ఇలా నమ్మిన ప్రతి ఒక్కరినీ జగన్ మోసం చేశాడని ఆరోపించారు. గతంలో జగన్ను నమ్మి అక్రమాలకు పాల్పడ్డ ఐఏఎస్లు జైలుకు వెళ్లారని, భవిష్యత్లో ఐఏఎస్, ఐపీఎస్లు కూడా జైలుకు పోయే పరిస్థితులు నెలకొంటాయని హెచ్చరించారు.
'విశ్వసనీయత అంటే మాదీ నాదీ' అంటూనే నయవంచన- ఇదే జగ'నైజం'
సొంత చెల్లి, తల్లితో ఆడుకున్నాడన్నారు: అధికారంలోకి వచ్చాక సీఎం జగన్ అందరితో అడుకుంటున్నాడని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి ఎద్దేవా చేశారు. చివరికి సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులతో ఆడుకుంటున్నారని విమర్శించారు. విశాఖ టీడీపీ కార్యాలయంలో బండారు మీడియాతో మాట్లాడారు. పారిశుద్ధ్య కార్మికులు, అంగన్వాడీ కార్మికులతో, భవన కార్మికులతో, మందు బాబులతో సీఎం జగన్ ఆడుకున్నాడనారు. సొంత చెల్లి, తల్లి తో ఆడుకున్నాడని విమర్శించారు. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులతో అడుకుంటున్నాడని ఆరోపించారు. టిడ్కో ఇళ్ల లబ్ది దారులతో జగన్ అడ్డుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయస్థానాలతో కూడా ఈ జగన్ ఆటలు ఆడుకుంటున్నారని. తాజాగా, ఈరోజు ఆడుకుందాం ఆంధ్రా అని పిలుస్తున్నారని విమర్శించారు. రేపు ప్రభుత్వం రాగానే, మద్యం, ల్యాండ్, సాండ్, లో వైసీపీ ప్రభుత్వం అవినీతిని ఆధారాలతో నిరూపించి జగన్ను జైలుకు పంపడం ఖాయమన్నారు. ఒక పక్క కరోనా వస్తోందని ఏరకమైన చర్యలు తీసుకోకుండా ఇంట్లో కూర్చుని పబ్జీగేమ్లు అడుకోమని బండారు ఎద్దేవా చేశారు.
'వైసీపీ గద్దె దిగేవరకు పోరాడతాం' - మోపిదేవికి మద్దతుగా మత్స్యకార సంఘాల సమావేశం