సీఏఏ, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా గుంటూరు జిల్లా మంగళగిరిలో ముస్లింలు ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టారు. రంజాన్ మాసంలో ముస్లింలు నిర్వహించే పవిత్ర ఉపవాస దీక్ష తరహాలోనే నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరో స్వాతంత్ర్య పోరాటం కోసం అందరూ సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. సాయంత్రం నమాజ్ చేసిన అనంతరం దీక్ష విరమించారు. కేంద్రం ప్రభుత్వం తమ హక్కులను హరిస్తోందని ముస్లిం నేతలు ఆరోపించారు. రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు అందరూ కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.
నంద్యాలలో ముస్లింల ర్యాలీ
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కర్నూలు జిల్లా నంద్యాలలో ముస్లింలు ర్యాలీ నిర్వహించారు. స్థానిక బాలాజీ కాంప్లెక్స్ నుంచి మౌలానా అబుల్ సర్కిల్ వరకు ర్యాలీ అనంతరం ధర్నా చేపట్టారు. తమకు నష్టం కలిగించే చట్టాలు రావడం దురదృష్టకరమని నాయకులు వాపోయారు. కేంద్రం ఈ చట్టాన్ని ఉప సంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి:
బిల్లుల్ని సెలెక్ట్ కమిటీకి పంపితే సర్కార్‌కు ఉలుకెందుకు..?