దిల్లీలో మతపరమైన ప్రార్థనలకు వెళ్లి వచ్చినవారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పరీక్షలు చేయించుకోవాలని ముస్లిం మత పెద్దలు కోరారు. గుంటూరు నల్లచెరువులోని మదర్సాలో వారు మీడియాతో మాట్లాడారు. దిల్లీలో సమావేశానికి వెళ్లొచ్చిన వారిని అంటరానివారిగా, దేశ ద్రోహులుగా చూస్తున్నారని అది మంచి విధానం కాదని అన్నారు. ప్రభుత్వం సూచనలు మేరకు మత సమావేశానికి వెళ్లి వచ్చిన వారందరూ పరీక్షలకు సహకరిస్తున్నారని వెల్లడించారు. త్వరలో జరగనున్న పెద్దల పండుగ, రంజాన్ వంటి పర్వదినాలకు కూడా మసీదులకు రాకుండా ఇంట్లోనే ప్రార్థనలు జరుపుకోవాలని సూచించారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో 226కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు