ETV Bharat / state

కుటుంబ సభ్యులు వెనకడగు వేశారు... ముస్లిం యువత చేసి చూపారు! - ఖిద్మత్ యూత్ న్యూస్

కరోనాతో మృతి చెందిన ఓ మహిళకు అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు వెనకాడారు. ఈ విషయం తెలిసిన ఓ స్వచ్ఛంద సంస్థ ముందుకు వచ్చి అంత్యక్రియలు పూర్తి చేశారు. ఈ ఘటన గుంటూరు జిల్లా రేవేంద్రపాడులో జరిగింది.

muslim youth
కరోనా మృతురాలికి అంత్యక్రియలు
author img

By

Published : Dec 16, 2020, 7:55 AM IST

గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం రేవేంద్రపాడుకి చెందిన ఓ మహిళ కరోనా బారిన పడింది. మంగళగిరి ఎన్నారై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. ఆ మహిళ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ముందుకు రాలేదు. జాగ్రత్తలు తీసుకొని అంతిమ సంస్కరాలు నిర్వహించవచ్చునని వైద్యులు సూచించినా.. వారు వెనకడుగు వేశారు.

మంగళగిరికి చెందిన ఖిద్మత్ యూత్ సభ్యులు ఈ విషయాన్ని తెలుసుకొని, అంత్యక్రియలు నిర్వహించేందుకు ముందుకొచ్చారు. మహిళ మృతదేహాన్ని రేవేంద్రపాడు శ్మశాన వాటికకు తీసువెళ్లి, అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు.

ఇదీ చదవండి:

పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి.. మోసం చేసి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.