Municipal Workers Talks With YCP Government: కనీస వేతనాల పెంపు, ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు సిబ్బందిని పర్మినెంట్ చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా 16 రోజులుగా మున్సిపల్ కార్మికుల సమ్మె (Municipal Workers Strike in AP) చేస్తున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్మికులుతో చర్చించేందుకు ప్రభుత్వం దిగొచ్చింది. కార్మిక సంఘ నేతలతో మంత్రి బొత్స, సజ్జల, ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి భేటీ అయి చర్చించారు.
మున్సిపల్ కార్మికులు ఆందోళనలు - ఉక్కుపాదం మోపిన పోలీసులు
Minister Botsa Satyanarayana Comments: మున్సిపల్ కార్మికులు గురువారం నుంచి తాత్కాలికంగా సమ్మె విరమించి విధుల్లోకి చేరుతారని మంత్రి బొత్స సత్యనారాయణ (Minister Botsa Satyanarayana) తెలిపారు. మున్సిపల్ కార్మికులకు 21 వేల రూపాయల వేతనం ఇస్తామన్నారు. సమ్మె కాలానికి కార్మికులకు జీతాలు చెల్లిస్తామని తెలిపారు. 2019 నుంచి చనిపోయిన కార్మికుల కుటుంబాలకు పరిహారం చెల్లిస్తామన్న బొత్స ప్రమాదవశాత్తు మరణిస్తే రూ. 7 లక్షలకు ఆర్థికసాయం పెంచామన్నారు.
పదో రోజు కొనసాగిన మున్సిపల్ కార్మికుల సమ్మె - పలుచోట్ల ఘర్షణలు
జీవో ఇచ్చే వరకు సమ్మె విరమించేది లేదు: ప్రభుత్వం పరిష్కరిస్తామన్న సమస్యలపై జీవోలు ఇచ్చే వరకు పూర్తిస్థాయిలో సమ్మె విరమించేది లేదని కార్మిక సంఘ నేతలు తేల్చి చెప్పారు. ప్రభుత్వంతో మున్సిపల్ కార్మికుల చర్చలు ముగిశాయి. 21 వేల రూపాయలు వేతనం, ఒక నెల జీతం బోనస్ గా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొన్ని డిమాండ్లకు ప్రభుత్వం హామీ ఇచ్చింది కార్మికులకు రూ.21 వేల వేతనం ఇస్తామని తెలిపారని అన్నారు. సమ్మె కాలంలో జీతం, కేసుల ఉపసంహరణకు హామీ ఇచ్చారని తెలిపారు. రాజధాని ప్రాంత కార్మికులను మున్సిపల్ పరిధిలోకి తేవాలని కోరగా సీఆర్‌డీఏ పరిధిలో ఉన్నందున పరిశీలించి చెబుతామన్నారని తెలిపారు. రేపు మినిట్స్ కాపీ, మూడు రోజుల్లో జీవో ఇస్తామని చెప్పినట్లు తెలిపారు.
సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్ కార్మికుల ఆందోళన - కలెక్టరేట్ల ముందు వంటావార్పు
ఇంజినీరింగ్ విభాగాల సమస్యలపై 9 మందితో కమిటీ వేస్తామన్నారని అన్నారు. ఔట్ సోర్సింగ్ సిబ్బందిని కాంట్రాక్టు పరిధిలోకి తేవాలని కోరాం కాంట్రాక్టు పరిధిలోకి తేవడంపై పరిశీలించి చెబుతామన్నారని కార్మిక సంఘాల నాయకులు తెలిపారు. వేతనం రూ.21 వేలు చేస్తే ఐఆర్ పెంచుతామన్నారు కానీ జీవో వచ్చాక పరిశీలించి సమ్మె విరమణ నిర్ణయం చెబుతామని నేతలు తెలిపారు. ప్రస్తుతానికి తాత్కాలికంగా సమ్మె విరమిస్తున్నాం. రేపటి నుంచి కార్మికులు పనుల్లోకి వెళ్తారు. ఇచ్చిన హామీలు జీవోలో లేకపోతే మళ్లీ సమ్మె చేపడతామని కార్మిక సంఘాల నాయకులు తెలిపారు.
ప్రభుత్వంతో జరిపిన చర్చలు కొంత సానుకూల వాతావరణంలో జరిగినప్పటికీ కార్మికులందరు సంతృప్తి చెందే పద్దతిలో లేరు. మేము పూర్తిగా సమ్మె విరమించలేము. ఈ సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నాం. రేపటి నుంచి కార్మికులు పనుల్లోకి వెళ్తారు. ప్రభుత్వం జీవోలు ఇచ్చే వరకు పూర్తిస్థాయిలో సమ్మె విరమించేది లేదు. రూ.21 వేల వేతనం, ఒక నెల జీతం బోనస్‌గా ఇవ్వాలి. లేకపోతే రూ.21 వేలకు అదనంగా రూ.2 వేలు వేతనం ఇవ్వాలి.- ఉమామహేశ్వరరావు, కార్శిక సంఘం నేత
కమిటీని నియమించిన ప్రభుత్వం: మున్సిపల్ కార్మికుల వేతనాల పెంపు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది వర్గీకరణ అంశంపై అధికారుల కమిటీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కార్మికుల తాత్కాలిక సమ్మె విరమణ ఒప్పందం మేరకు ప్రభుత్వం జీవో జారీ చేసింది. విజయవాడ, రాజమండ్రి మున్సిపల్ కమిషనర్లు సహా 9 మంది అధికారులతో ఓ కమిటీని ప్రభుత్వం నియమించింది. ఔట్ సోర్సింగ్ సిబ్బంది విధుల ఆధారంగా కమిటీ వర్గీకరించనుంది. వేతనం పెంపు వర్తించేలా ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని జేఏసీ వర్గీకరించాలని కోరింది. స్కిల్డ్, సెమీస్కిల్డ్, అన్ స్కిల్డ్ సిబ్బంది విధుల ఆధారంగా వేతనం పెంచనున్నారు. వారంలోగా వర్గీకరణ పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది.