జీతాలు చెల్లించాలంటూ రాజధాని గ్రామాల్లో పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన చేపట్టారు. గుంటూరు జిల్లాలోని ఎర్రబాలెం సీఆర్డీఏ కార్యాలయం వద్ద సీపీఎం ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు, సీపీఎం నేతలు మోకాళ్లు మీద కూర్చొని నిరసన చేపట్టారు.
ఏడున్నర నెలలుగా జీతాలు ఇవ్వడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి వెంటనే జీతాలు చెల్లించాలంటూ డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: