సమస్యలు పరిష్కరించాలంటూ గుంటూరు జిల్లా తెనాలి మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు నిరసన చేపట్టారు. కళ్లకు గంతలు కట్టుకుని ముందుకు నడుస్తూ ర్యాలీ నిర్వహించారు. కరోనా సమయంలో తమ ప్రాణాలు కాపాడుకునేందుకు అవసరమైన పనిముట్లు వెంటనే ఏర్పాటు చేయాలని కోరారు. గత ఏడాది నుంచి విధి నిర్వహణలో కరోనా బారిన పడి మరణించిన కార్మికులకు .. 'గరీబ్ కళ్యాణ్ యోజన ఇన్సూరెన్స్ పథకం' ద్వారా ఒక్కొక్కరికి 50 లక్షల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
కొంతమందికి జీతాలు పెండింగ్లో ఉన్నాయని.. వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆప్కాస్(ఔట్సోర్సింగ్ కార్పొరేషన్) రద్దు చేసి కార్మికులను వెంటనే పర్మినెంట్ చేయాలని నినాదాలు చేశారు. మరికొన్ని అంశాలపై నిరసన కార్యక్రమం చేపట్టి ర్యాలీ నిర్వహించారు.
ఇదీ చదవండి: