గుంటూరు జిల్లాలో పురపాలక ఎన్నికల పోలింగ్ మందకొడిగా సాగుతోంది. ఈ క్రమంలో మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి జిల్లావ్యాప్తంగా 44.69 శాతం పోలింగ్ నమోదైంది. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో అత్యల్పంగా 39.39 శాతం పోలింగ్ నమోదైంది. తెనాలిలో 53.01, చిలకలూరిపేటలో 51.50, రేపల్లెలో 50.49, సత్తెనపల్లిలో 55.03, వినుకొండలో 59.03 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం 7 గంటలకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ... సగం మంది ఓటర్లు మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎండ వేడిమి తగ్గాక ఓటర్లు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
గుంటూరులో ఒంటిగంట వరకు 44.69 శాతం పోలింగ్ - గుంటూరులో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ
గుంటూరులో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు జిల్లావ్యాప్తంగా 44.69 శాతం పోలింగ్ నమోదవ్వగా.. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో అత్యల్పంగా 39.39 శాతం నమోదైంది.