మున్సిపల్ కార్మికులకు ప్రతి నెల 5న జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మున్సిపల్ కార్మిక సంఘం ఉపాధ్యక్షుడు కోట మల్యాద్రి డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు ఉన్న బకాయిలు వెంటనే చెల్లించాలని గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. జీవో నెం. 885 ప్రకారం కార్మికులకు సదుపాయాలు కల్పించాలన్నారు. 4 ఏళ్లుగా ఉద్యోగులకు రావాల్సిన ఏకరూపదుస్తులు, చెప్పులు, సబ్బులు, కొబ్బరినూనె సకాలంలో అందించాలన్నారు. ఒప్పంద కార్మికులకు 15 రోజులు సాధారణ సెలవులను కల్పించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే విధులు బహిష్కరించకపోతే.. ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.
ఇది కూడా చదవండి.