గుంటూరు జిల్లా తెనాలి మున్సిపల్ కార్మికుల సమస్యలపై ఉన్నతాధికారులకు పలుమార్లు సమస్యలను విన్నవించినా పట్టించుకోలేదన్నారు. అందుకే ఈనెల 14, 15 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేపట్టనున్నట్లు జిల్లా మున్సిపల్ వర్కర్ల సంఘ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు తెలిపారు. సమ్మెకు సంఘీభావంగా మౌన నిరసన కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. మున్సిపాలిటీలోని అన్ని విభాగాల కార్మికులకు సమస్యలు ఉన్నాయని, వాటిని వెంటనే పరిష్కరించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు దిగుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ప్రధానంగా మున్సిపాలిటీలోని ఇంజనీరింగ్ విభాగంలోని వాటర్ వర్కర్లకు, టౌన్ ప్లానింగ్ విభాగం, కంప్యూటర్ ఆపరేటర్ లకు, సెక్యూరిటీ విభాగాలకు.. రాష్ట్ర ప్రభుత్వం అధికారం చేపట్టిన దగ్గరి నుంచి.. ఇప్పటి వరకు వేతనాలు పెంచిన దాఖలాలు లేవని మండిపడ్డారు. మున్సిపల్ కార్మికులకు పేరుకు మాత్రమే 8 గంటల విధులు.. క్షేత్రస్థాయిలో మాత్రం అంతకంటే ఎక్కువ సమయం పని చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యలన్నిటినీ వెంటనే పరిష్కరించాలని లేదంటే రాష్ట్రవ్యాప్తంగా సమ్మెకు దిగుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఇవీ చదవండి: