గుంటూరు జిల్లా మాచవరం మండలం పిన్నెల్లి గ్రామంలో అక్రమంగా మట్టి తవ్వకాలు చేపడుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వీటి గురించి ఉన్నతాధికారులను వివరణ కోరగా విచారిస్తామని చెప్పి ఎలాంటి చర్యలు తీసుకోకుండా దాట వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత పదిరోజులుగా ఈ తంతు జరగుతున్న చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారన్నారు. త్వరితగతిన ఈ విషయంపై తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
ఇదీ చదవండి'ఒకే దేశం ఒకే ఎన్నిక' పై భిన్న స్వరాలు