నరసరావుపేట పట్టణాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించేలా కృషి చేస్తానని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. ఈ మేరకు జిల్లా సాధన సమితి సభ్యులు ఎంపీని గుంటూరులో కలసి వినతిపత్రం అందించారు. జిల్లాగా ప్రకటించేందుకు నరసరావుపేటకు అన్ని అర్హతలున్నాయని... విద్య, వైద్య సదుపాయాలతో పాటు కార్యాలయాల ఏర్పాటుకు అనువైన స్థలాలు ఉన్నాయని ఎంపీ చెప్పారు. పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడుగురు ఎమ్మెల్యేలతో కలిసి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని ఎంపీ హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: