ETV Bharat / state

విషాదం.. నిమిషాల వ్యవధిలో తల్లీ కుమారుడు మృతి

నిమిషాల వ్యవధిలో తల్లీ కుమారుడు మృతి చెందిన విషాద ఘటన గుంటూరు జిల్లా అప్పాపురంలో జరిగింది. తల్లి చనిపోయిన కొద్ది సమయానికే కుమారుడు గుండెపోటుతో మరణించాడు. ఒకేసారి ఇద్దరు కుటుంబ సభ్యులను కోల్పోయిన ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది.

Mother son died
Mother son died
author img

By

Published : Dec 4, 2020, 9:38 PM IST

తల్లి మృతి చెందిన నిమిషాల వ్యవధిలోనే గుండెపోటుతో కుమారుడు మృతి చెందాడు. తల్లి మరణ వార్తను బంధువులకు చెప్పేందుకు ఫోన్ చేస్తూనే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గుంటూరు జిల్లా కాకుమాను మండలం అప్పాపురంలో దారా విజయమ్మ (80), ఆమె కుమారుడు సజ్జనారావు (58) నిమిషాల వ్యవధిలోనే మృతి చెందారు. దీంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.

సజ్జనారావు కర్లపాలెం మండలం గణపవరం జడ్పీ ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. ప్రస్తుతం ఆయన రాష్ట్ర వ్యాయామ అసోసియేషన్ కన్వీనర్​గా ఉన్నాడు. ఆదాయ పన్నుల శాఖ కమిషనర్ మేకతోటి దయాసాగర్, రాష్ట్ర వ్యాయామ ఉపాధ్యాయ అసోసియేషన్ అధ్యక్షుడు ఏపీ రెడ్డి, ఉపాధ్యాయులు సజ్జనారావు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.

ఇదీ చదవండి : రాజధాని కేసులో ముగిసిన పిటిషనర్ల వాదనలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.