ఆగస్టు 31 నాటికి గ్రామ సచివాలయాల నిర్మాణం పూర్తి చేస్తామని అధికారులు ముఖ్యమంత్రి జగన్కు తెలిపారు. అలాగే వార్డు, గ్రామ సచివాలయాల్లో 16,208 పోస్టులు ఖాళీగా ఉన్నాయని సీఎంకు నివేదించిన అధికారులు... పరీక్షలకు అనుమతులు రాగానే భర్తీ చేస్తామని తెలిపారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి... ఉపాధి హామీ పనులు, గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. సమావేశంలో అధికారులు ఈ వివరాలను సీఎంకు నివేదించారు. అలాగే వచ్చే ఏడాది మార్చి 31కల్లా రైతుభరోసా కేంద్రాలు, ఆరోగ్య ఉప కేంద్రాల నిర్మాణాలను పూర్తి చేస్తామని చెప్పారు. పాఠశాలల్లో నాడు– నేడు కార్యక్రమాలు జూలై 31 వరకు పూర్తి చేస్తామన్నారు.
ఉపాధి హామీ పథకంలో కూలీలకు వీలైనన్ని ఎక్కువ పని దినాలు కల్పించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. వర్షాలు వచ్చేలోపు వీలైనన్ని పని దినాలు కల్పించాలని సూచించారు.
ఇదీ చదవండి