ETV Bharat / state

ఎన్డీఆర్ఎఫ్ ఆధ్వర్యంలో రైలు ప్రమాదాలపై మాక్ డ్రిల్

రైలు ప్రమాదాలు జరిగినప్పుడు అత్యవసర సర్వీసుల సిబ్బంది ఎలా స్పందిస్తారు.... బాధితుల్ని కాపాడటం ఎలా... పరిస్థితిని సరిచేయటం ఎలా... ఇలాంటి అంశాలపై ఎన్డీఆర్ఎఫ్ ఆధ్వర్యంలో గుంటూరులో నమూనా ప్రదర్శన జరిగింది. రైల్వే సిబ్బందితో కలిసి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది పనిచేయటంపై అవగాహన కల్పించే లక్ష్యంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు.

Mock drill on train accidents
రైలు ప్రమాదాలపై మాక్ డ్రిల్
author img

By

Published : Feb 11, 2021, 5:48 PM IST

ప్రమాదం ఏదైనా సరే వెంటనే గుర్తొచ్చేది విపత్తు నిర్వహణ బృందాలే. దేశంలో ఎక్కడ ఎలాంటి విపత్తు జరిగినా అక్కడ వాలిపోతారు. బాధితుల్ని రక్షిస్తారు. ప్రజలకు అండగా నిలబడతారు. వివిధ సందర్భాలకు తగ్గట్లుగా పనిచేయటంపై వారు తరచూ సాధన చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా... రైలు ప్రమాదాలు జరిగినప్పుడు ఎలా స్పందించాలనే అంశంపై గుంటూరులో ఓ మాక్ డ్రిల్ నిర్వహించారు. రైల్వే వర్క్ షాప్ ప్రాంగణంలో జరిగిన ఈ డ్రిల్​లో.... ఎక్కడైనా రైలు పట్టాలు తప్పినప్పుడు ఎలా స్పందించాలన్నది.. చేసి చూపించారు.

రైల్వే శాఖలోని పరిపాలన, ఇంజినీరింగ్, సాంకేతిక, వైద్య సిబ్బందితో సమన్వయం చేసుకుని అక్కడ సహాయ చర్యలు చేపట్టారు. బోగీలో ఉన్నవారిని రక్షించటం మొదటి ప్రాధాన్యతగా గుర్తించారు. అందుకుగాను పై భాగంలో కట్ చేసి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది లోపలకు ప్రవేశించారు. ఆ తర్వాత రైలులోని ప్రయాణికులను బయటకు తీసుకురావటం, వారికి ప్రథమ చికిత్స అందించటం, ఆసుపత్రికి తరలించటం, ఆ తర్వాత ట్రాక్​ను క్లియర్ చేయటం వరకూ చేపట్టాల్సిన అంశాలపై డ్రిల్ నిర్వహించారు.

రైల్వే ఉన్నతాధికారులు, ఎన్డీఆర్ఎఫ్ టీం కమాండర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల ఎక్కడ ఏం జరిగినా పరిస్థితిని సులువుగా అర్థం చేసుకుని వేగంగా స్పందించేందుకు, సాయం చేసేందుకు వీలవుతుందని ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్ కమాండెంట్ ఆర్పీ చౌదురి తెలిపారు.

ఇదీ చదవండి:

బెడ్​షీట్స్​ మాటున.. ఎర్రచందనం అక్రమ రవాణా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.