ఇళ్లల్లోకి చొరబడి ఖరీదైన సెల్ఫోన్లను దొంగలిస్తున్న ఘరానా దొంగను గుంటూరు జిల్లా తెనాలి పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు బడగల పార్థసారథి నుంచి 2 లక్షల విలువ చేసే 14 మెుబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. తెనాలి రామలింగేశ్వరపేటకు చెందిన బడగల పార్థసారథి విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెనాలి వన్‌టౌన్ సీఐ రాజేష్ కుమార్ తెలిపారు. అర్థరాత్రి సయాల్లో ఇళ్లల్లోకి ప్రవేశించి.. మెుబైల్ ఫోన్లు దొంగిలించేవాడనీ.. గతంలో నిందితుడిపై 20కి పైగా కేసులు ఉన్నట్లు సీఐ వివరించారు.
ఇదీ చదవండి: బాలికపై అత్యాచారయత్నం.. నిందితుడు అరెస్ట్