కరోనా వ్యాప్తి దృష్ట్యా... డిగ్రీ పరీక్షలనూ వాయిదా వేయాలని ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు డిమాండ్ చేశారు. ఇప్పటికే పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలను రద్దు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. జులై 1 నుంచి నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేయడం సమంజసం కాదన్నారు. విద్యార్ధుల క్షేమం, అధ్యాపకుల శ్రేయస్సును పరిగణలోనికి తీసుకుని పరీక్షలను వాయిదా వేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఇదీచదవండి.