ప్రతిష్టాత్మక గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్న చిన్నారి ఫజీలాను స్థానిక వైకాపా కార్యాలయంలో ఎమ్మెల్యే విడదల రజిని అభినందించారు. తండ్రి రహీమ్‌తో కలిసి ఫజీలా.. ఎమ్మెల్యేను కలిశారు. మరోసారి అందరి సమక్షంలో ఆవర్తన పట్టికలో మూలకాలను చిన్నారి అమర్చింది. కేవలం 1.27 నిమిషాల్లోనూ చిన్నారి మూలకాలను అమర్చడంతో ఎమ్మెల్యే అబ్బురపోయారు. బాలిక ప్రతిభను చూసి ఆమె ప్రశంసల జల్లు కురిపించారు. చిన్నారికి తన సహకారం ఎప్పుడూ ఉంటుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. తన కుమార్తె ప్రతిభకు ఎమ్మెల్యే సహకారం కూడా తోడైతే మంచి భవిష్యత్‌కు మంచి బాటలు వేసినట్లు అవుతుందని రహీమ్ ఆకాంక్షించారు.
అతి తక్కువ సమయంలో ఆవర్తన పట్టికను పేర్చి..
గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని సుభాని నగర్‌కు చెందిన తొమ్మిదేళ్ల చిన్నారి ఫజీలా.. ప్రతిష్టాత్మకమైన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది. రసాయన శాస్త్రంలోని ఆవర్తన పట్టికలో ఉన్న మూలకాలను అతి తక్కువ సమయంలో పేర్చటంలో ఫజీలా ఈ రికార్డు సాధించింది. కేవలం ఒక నిముషం 43 సెకన్లలో ఆమె పేర్చి.. 2 నిముషాల 29 సెకన్లతో ఉన్న పాకిస్థాన్ బాలిక రికార్డును ఫజీలా అధిగమించింది. ఫజీలా తండ్రి రహీం పెదనందీపాడులోని ప్రభుత్వ ఉర్దూ ప్రాధమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. తల్లి గృహిణి. తండ్రి ఉపాధ్యాయుడు కావటంతో... ఆయన తెలిపిన విషయాలను ఆసక్తిగా గమనిస్తూ ఉండేది. రసాయన శాస్త్రంపై ఆసక్తితో పట్టు సాధించి గిన్నిస్ రికార్డును సాధించింది.
ఇదీ చదవండి: