గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం యడవల్లి గ్రామంలో సహకార శాఖ డివిజన్ అథారిటీ సొసైటీ భూముల రద్దును వ్యతిరేకిస్తూ తీర్పు ఇవ్వగా ఆ భూములను ఎమ్మెల్యే విడదల రజని పరిశీలించారు. గత ప్రభుత్వం సొసైటీ భూములను రద్దు చేస్తే తమ ప్రభుత్వం పునరుద్ధరించిందని ఎమ్మెల్యే అన్నారు. రైతులకు పట్టాలు వచ్చే విధంగా కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు తనను విమర్శించే హక్కు లేదని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ రైతులు పంటలు పండించుకునేలా అన్ని చర్యలు తీసుకుంటామనన్నారు. త్వరలో రైతులతో కలిసి సీఎంను కలుస్తామని తెలిపారు.
ఇదీచూడండి. భూములు సొసైటీకే ఇస్తూ ఉత్తర్వులు జారీ