ETV Bharat / state

ఎమ్మెల్యే కుమార్తె ప్రతిభ.. నీట్​లో 40వ ర్యాంక్

author img

By

Published : Nov 3, 2021, 8:10 AM IST

తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కుమార్తె నీట్​లో ప్రతిభ చాటారు. ఎస్సీ కేటగిరిలో 40, ఓపెన్​ కేటగిరిలో 2050 ర్యాంకుతో సత్తా చూపారు.

mla sridevi doughter got 40rank in neet
mla sridevi doughter got 40rank in neet

జాతీయ వైద్య విద్య పరీక్ష (నీట్‌)-2021లో ఎమ్మెల్యే డాక్టర్‌ ఉండవల్లి శ్రీదేవి కుమార్తె విజయ వెంకట భవ్య ఎస్సీ కేటగిరిలో 40, ఓపెన్‌ కేటగిరిలో 2050 ర్యాంకుతో ప్రతిభ చాటారు. గుంటూరులోని తన కార్యాలయంలో మంగళవారం ఎమ్మెల్యే శ్రీదేవి తన కుమార్తెకు కేకు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కష్టపడి చదివితే ర్యాంకులు వస్తాయని, దేవుడి ఆశీసులతో తన బిడ్డ మరింత ఉన్నత స్థాయికి చేరి రాష్ట్రానికి మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు. జాతీయ స్థాయిలో తన కుమార్తెకు మంచి ర్యాంకు రావడం ఆనందంగా ఉందన్నారు.

విజయవెంకట భవ్య మాట్లాడుతూ తన తల్లి వైద్యురాలు కావడంతో చిన్నప్పటి నుంచి తనకు వైద్య విద్యపై మక్కువ పెరిగిందని, ఆమె సూచనలతో కష్టపడి చదివి పరీక్ష రాశానని, మంచి ర్యాంకు రావడం సంతోషంగా ఉందన్నారు. ఆమెకు కుటుంబ సభ్యులు, వైకాపా నాయకులు అభినందనలు తెలిపారు.

ఇదీ చదవండి:

DEPUTY SPEAKER KONA RAGHUPATHI: సతీమణితో సరదాగా డిప్యూటీ స్పీకర్​... బుగ్గ కారు వదిలి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.