గుంటూరు జిల్లా చిలకలూరిపేట పట్టణంలో కరోనా పాజిటివ్ వచ్చిన ప్రాంతంలో ఎమ్మెల్యే విడదల రజని పర్యటించారు. పారిశుద్ధ్య చర్యలు పరిశీలించారు. రసాయనాలు పిచికారీ చేసే బెల్‌మాస్టర్ యంత్రాన్ని ప్రారంభించారు. కరోనా సోకిన మహిళతో సంబంధం ఉన్న వారిని వారిని క్వారంటైన్ కేంద్రానికి తరలిస్తుండడాన్ని గమనించారు.
క్వారంటైన్ కేంద్రాలకు వెళ్తున్న వారితో మాట్లాడారు. ధైర్యం చెప్పారు. అవసరాలు తీర్చేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తన వీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాధితుల ఇళ్లకు సరకులు పంపుతానని చెప్పారు. పట్టణంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కేసులు పెరగడానికి వీల్లేదని ..అధికారులు అప్రమత్తంగా ఉండాలనీ ఆదేశించారు.
ఇదీ చూడండి: