ETV Bharat / state

ఎక్సైజ్​ హెడ్​ కానిస్టేబుల్​పై ఎమ్మెల్యే రజనీ ఆగ్రహం

మద్యం అక్రమ విక్రయాలు జరపడానికి లంచం డిమాండ్ చేసిన ఎక్సైజ్ హెడ్ కానిస్టేబుల్‌పై ఎమ్మెల్యే విడదల రజినీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

mla rajini fires on excise head constable
ఎక్సైజ్ హెడ్ కానిస్టేబుల్‌పై నిప్పులు చెరిగిన ఎమ్మెల్యే విడదల రజినీ
author img

By

Published : Apr 8, 2020, 8:11 AM IST

లాక్ డౌన్ సమయంలో మద్యం అక్రమ అమ్మకాలు ప్రోత్సహిస్తున్నారంటూ ఎక్సైజ్ హెడ్ కానిస్టేబుల్​పై గుంటూరు జిల్లా చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీ ఆగ్రహం వ్యక్తం చేశారు. లంచం డిమాండ్ చేస్తూ ఎక్సైజ్​ హెడ్ కానిస్టేబుల్‌ మాట్లాడిన ఆడియో టేపును వినిపిస్తూ రజనీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మ‌ద్య‌పాన నిషేధం దిశ‌గా అడుగులు వేస్తున్న ప్ర‌భుత్వ సంకల్పాన్ని దెబ్బ‌తీయాల‌ని చూస్తారా అంటూ నిప్పులు చెరిగారు. ఒక‌వైపు ప్ర‌భుత్వ ఆదాయం త‌గ్గుతున్నా స‌రే త‌మ ప్ర‌భుత్వం మ‌ద్యం విష‌యంలో క‌ఠినంగా ఉంటోంద‌ని గుర్తుచేశారు. ఉన్న‌తాధికారుల‌కు ఫోన్ చేసి స‌ద‌రు హెడ్ కానిస్టేబుల్‌పై చ‌ర్య‌లు తీసుకోవాల్సిందిగా ఎమ్మెల్యే ఆదేశించారు.

ఇదీ చదవండి :

ఎమ్మెల్యే విడదల రజనీ బంధువుపై దాడి కేసులో ఆరుగురి అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.