ETV Bharat / state

భూసర్వేతో ఇనాం భూములకు రైతు యాజమాన్య హక్కులు: ఎమ్మెల్యే బొల్లా - ఇనాం భూములపై ఎమ్మెల్యే బొల్లా కామెంట్స్

భూ సర్వేతో రాష్ట్రవ్యాప్తంగా భూవివాదాలు పరిష్కారమవుతాయని వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు స్పష్టం చేశారు. వినుకొండ అగ్రహారం ఇనాం భూములకు రైతు హక్కులు కల్పిస్తామన్నారు.

భూసర్వేతో ఇనాం భూములకు రైతు యాజమాన్య హక్కులు

author img

By

Published : Dec 18, 2020, 10:58 PM IST

గుంటూరు జిల్లా వినుకొండ అగ్రహారం ఇనాం భూములకు ప్రభుత్వం భూ సర్వే ద్వారా రైతులకు హక్కులు కల్పిస్తుందని ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు స్పష్టం చేశారు. భూ సర్వే చేపట్టడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా భూవివాదాలు పరిష్కారమవుతాయన్నారు. వినుకొండ నియోజకవర్గంలో 17,500 ఎకరాల ఇనాం అగ్రహారం భూములు ఉన్నాయని వెల్లడించారు. ఆ ప్రాంత రైతులు హక్కులు లేక దశాబ్దాలుగా ఇబ్బంది పడుతున్నారని అలాంటి రైతులందరికీ ప్రభుత్వం విముక్తి కలిగిస్తుందన్నారు. అర్హులైన ప్రతి పేదవానికి ఇళ్ల స్థలాలు ఈనెల 25 నుంచి పంపిణీ చేసేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు.

గత పాలకులు ప్రజా సమస్యలను గాలికొదిలేయటం వల్లే నేడు రైతులు, సామాన్య ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని బ్రహ్మనాయుడు విమర్శించారు. తుపాను బాధిత రైతులను గుర్తించి త్వరలోనే పంట నష్ట పరిహారం ఇవ్వటం జరుగుతుందన్నారు. ఈ- క్రాప్ట్​లో నమోదైన ప్రతి రైతుకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని.. రైతులు ధైర్యంగా ఉండాలన్నారు. తనపై తెదేపా నేతలు లోకేశ్, జీవీ ఆంజనేయులు అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు.

ఇదీచదవండి

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.