ETV Bharat / state

'మానవత్వం లేని వాళ్లు.. జాతికి భారం' - MLA Ambati Rambabu latest news

రాష్ట్రమంతటా వైద్యం పేరిట ప్రజలను పిండేస్తున్నారని.. ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆరోపించారు. కరోనా బాధితుల నుంచి కొందరు వైద్యులు లక్షలు వసూలు చేస్తున్నారని ఆగ్రహించారు.

mla ambati
ఎమ్మెల్యే అంబటి రాంబాబు
author img

By

Published : May 19, 2021, 11:34 AM IST

మానవతా దృక్పథం లేని వైద్యులు జాతికి భారమని, అలాంటి వారిని సమాజం నుంచి వెలి వేయాలని గుంటూరు జిల్లా సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సత్తెనపల్లి వైకాపా కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కరోనా బాధితులకు పడకల కోసం తాపత్రయం అంతటా ఉందని చెప్పారు.

ఇదే అదనుగా కొందరు వైద్యులు రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు వైద్యసేవలకు వసూలు చేస్తున్నా రోగి బతుకుతాడో లేదో తెలియని పరిస్థితి ఉందని వాపోయారు. వైద్యం పేరిట ప్రజలను పిండేస్తున్న పరిస్థితి అంతటా ఉందన్నారు. ఆసుపత్రులు అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్లు లిఖితపూర్వక ఫిర్యాదు వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇదీ చదవండి:

అత్యవసర వెంటిలేటర్లు... అట్టపెట్టెల్లోనే..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.