ETV Bharat / state

ఎవర్ని లెక్కచేసేది లేదు..! అడ్డొచ్చారో అంతే..! ఎస్సీలపైనే ఎస్సీ కేసులు..! - MISUSE OF ATROCITIES ACT IN AP

MISUSE OF ATROCITIES ACT : ఎస్సీ, ఎస్టీలకు రక్షణగా ఉండాల్సిన అట్రాసిటీ చట్టం రాష్ట్రంలో విపక్షాల అణచివేతకు అస్త్రంగా మారింది. అధికార పార్టీకి వ్యతిరేకంగా గొంతెత్తినా, ప్రతిపక్షాలు రోడ్డెక్కినా.. అట్రాసిటీ కేసులతో కట్టిపడేస్తున్నారు. ఎంతలా అంటే.. ఏకంగా ఎస్సీలపైనే అట్రాసిటీ కేసులు నమోదు చేసేంతగా.. రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ దిగజారిపోయింది. చట్టం దుర్వినియోగమవుతోందని .. కోర్టులు మొట్టికాయలు వేసినా.. తీరు మారడం లేదు.

MISUSE OF ATROCITIES ACT
MISUSE OF ATROCITIES ACT
author img

By

Published : Feb 24, 2023, 7:15 AM IST

MISUSE OF ATROCITIES ACT ON SC AND ST : రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం దుర్వినియోగంపై ఒక మాజీ IAS ఆవేదన చెందుతున్నారు. ఈ పోకడ ప్రమాదకరమని.. ప్రభుత్వంపై ఆయన గవర్నర్‌కూ ఫిర్యాదు చేశారు. ఎస్సీలు, గిరిజనులపై కుల వివక్ష, వేధింపుల నిరోధించాలనే సదుద్దేశంతో తెచ్చిందే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం. కానీ వైసీపీ సర్కార్‌.. దాన్ని విపక్షాలను కట్టడి చేసే అస్త్రంగా.. ఎంచుకుంది. రాజకీయ ప్రత్యర్థులపై పగ తీర్చుకునేందుకు, అట్రాసిటీ కేసులు బనాయించడం.. ఓ ఉద్యమంలా సాగిస్తోంది. చివరకు ఎస్సీలపైనే అట్రాసిటీ కేసులు పెట్టడం.. ఎప్పుడో చనిపోయిన వారినీ అట్రాసిటీ కేసుల్లో నిందితులుగా చేర్చడం.. దుర్మార్గానికి పరాకాష్ట.

ప్రశ్నిస్తే అట్రాసిటీ కేసులే: అధికార పార్టీ నాయకుల అక్రమాల్ని ప్రశ్నించడమే పాపం అన్నట్లు.. కేసులు పెట్టేస్తున్నారు. ప్రకాశం జిల్లా కులుజువ్వలపాడులో.. అక్రమంగా మట్టి తవ్వుతున్నారని ప్రశ్నించినందుకు వైఎస్సార్సీపీ నాయకులు కృష్ణారెడ్డి అనే వ్యక్తిపై దాడి చేశారు. చివరకు గాయపడిన కృష్ణారెడ్డి పైనే.. అట్రాసిటీ కేసు నమోదు చేశారు. విజయనగరంలోని.. బొగ్గుల దిబ్బలో ఇటీవల నగరపాలిక అధికారులు పేదల ఇళ్లు కూల్చారు. ప్రజలకు సంఘీభావంగా వెళ్లిన జనసేన నేత యశస్వి పైనా.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు.

ఒంగోలుకు చెందిన అధికార పార్టీ నాయకుడు సుబ్బారావు గుప్తాపై మాజీ మంత్రి బాలినేని అనుచరులు దాడి చేసి.. సోషల్‌ మీడియాలో వైరల్‌ చేశారు. ఈ క్రమంలోనే ఒంగోలు నగరపాలక సంస్థ ప్రాంగణంలో.. పొట్టి శ్రీరాములు విగ్రహం గురించి ప్రశ్నించాడంటూ.. మేయర్ ఇచ్చిన ఫిర్యాదుతో సుబ్బారావు గుప్తాపై అట్రాసిటీ కేసు నమోదైంది.

ఇక 3 రాజధానులకు మద్దతుగా ఆందోళన చేపట్టేందుకు వెళ్తున్న వారిని.. కృష్ణాయపాలెంలో అడ్డుకుని కులం పేరిట దూషించారంటూ.. మంగళగిరి గ్రామీణ పోలీసులు.. 11 మంది అమరావతి రైతులను అరెస్ట్‌ చేసి అట్రాసిటీ కేసు పెట్టారు. వారిలో ఐదుగురు దళితులుండగా.. వారి పైనా అట్రాసిటీ కేసు పెట్టి 18 రోజులు జైల్లో ఉంచారు. కులం పేరుతో దూషించినట్లు.. అసలు తాను చెప్పనేలేదని ఫిర్యాదుదారే.. కోర్టులో అఫిడవిట్‌ వేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

2016లో మరణించిన వ్యక్తిపై 2020లో అట్రాసిటీ కేసు: అమరావతి రాజధాని గ్రామమైన ఉద్ధండరాయునిపాలెంలో.. 3 రాజధానులకు మద్దతుగా దీక్ష చేస్తున్న వారిపై దాడి చేశారంటూ 25 మంది రైతులపై.. 2020 డిసెంబరులో అట్రాసిటీ కేసులు పెట్టారు. అందులో 16వ నిందితురాలిగా ఉన్న బత్తుల హైమావతి 2016లోనే చనిపోగా.. 21వ నిందితుడిగా చేర్చిన పులి చిన్నా దళితుడు కావడం విమర్శలకు తావిచ్చింది.

తెలుగుదేశం నేతలు నిరసనంటూ రోడ్డెక్కడమే పాపం అన్నట్లు.. ఎస్సీ, ఎస్టీ అస్త్రం ప్రయోగించారు. పులివెందులలో అత్యాచార బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ డీఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన దళిత నేతలు వంగలపూడి అనిత, M.S.రాజు పైనా.. అట్రాసిటీ కేసు పెట్టారు. ఇక రేపల్లె రైల్వేస్టేషన్‌లోసామూహిక అత్యాచారానికి గురైన దళిత మహిళకు.. న్యాయం చేయాలంటూ.. గతేడాది మే 2న ఒంగోలులో హోంమంత్రి వనితను తెలుగు మహిళలు అడ్డుకున్నారు. వైసీపీ నాయకుడి ఫిర్యాదుతో.. వారి పైనా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కట్టేశారు.

ఇక ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటిపై మంత్రి జోగి రమేశ్‌ దాడి యత్నాన్ని.. అడ్డుకున్న తెలుగుదేశం నేతలపై అట్రాసిటీ కేసులు పెట్టారు. జోగి రమేశ్‌ డ్రైవర్‌ ఫిర్యాదుతో.. గద్దె రామ్మోహన్, బుద్దా వెంకన్న, బోడె ప్రసాద్‌,పట్టాభి సహా 11 మందిని.. నిందితులుగా చేర్చారు. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి అటవీ ప్రాంతంలో అక్రమ మైనింగ్ పరిశీలనకు వెళ్లి తిరిగి వస్తుండగా.. మాజీమంత్రి దేవినేని ఉమపై వైసీపీ శ్రేణులు దాడి చేశారు. ఈ ఘటనలో.. తిరిగి ఉమపైనే.. అట్రాసిటీ కేసు నమోదైంది.

దెందులూరు మాజీ ఎమ్మెల్యేపై చింతమనేని ప్రభాకర్‌పై నమోదైన కేసులైతే లెక్కేలేదు. మంత్రి పెద్దిరెడ్డి ఇలాకాలో తెదేపా నాయకులు, కార్యకర్తలపై దాదాపు 50కు పైగా అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. ఓ కేసులో.. జైలు నుంచి విడుదలై వస్తున్న జేసీ ప్రభాకర్‌రెడ్డికి స్వాగతం పలికేందుకు వస్తున్న వాహనశ్రేణిని అడ్డుకున్న సీఐని ప్రశ్నించినందుకు.. ప్రభాకర్‌రెడ్డిపై అట్రాసిటీ కేసు పెట్టారు.

ఇక ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం ఉపకులపతి దామోదరనాయుడిపైనా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి అరెస్టు చేశారు. సస్పెన్షన్‌లో ఉన్న తనను తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తే కులం పేరుతో దూషించారంటూ మురళీకృష్ణ అనే ఉద్యోగి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అస్త్రం ప్రయోగించారు. దామోదరనాయుడిని ఉపకులపతి పదవి నుంచి తప్పించాలని.. వైసీపీ నేతలు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడం వల్లే.. ఆయనపై అట్రాసిటీ కేసు పెట్టారనే ఆరోపణలున్నాయి.

కోర్టులు తప్పుబట్టిన మారని తీరు: రాజకీయ ప్రేరేపితంగా నమోదైన ఎస్సీ, ఎస్టీ కేసులను.. న్యాయస్థానాలూ తప్పుపట్టిన సందర్భాలూ లేకపోలేదు. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై గొంది రాజు అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అట్రాసిటీ కేసు నమోదు చేయగా.. దీన్ని హైకోర్టు తప్పు పట్టింది. అసలు రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలకు అట్రాసిటీ చట్టం ఎలా వర్తిస్తుందని పోలీసులను ప్రశ్నించింది. ఆ కేసులో.. తదుపరి చర్యలన్నింటినీ నిలిపివేస్తూ తీర్పు ఇచ్చింది. ఇక సీఎం, హోంమంత్రిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ... మాజీ మంత్రి అయ్యన్నపై నమోదు చేసిన అట్రాసిటీ కేసు దర్యాప్తునూ హైకోర్ట్‌ నిలిపివేసింది. అమరావతి ప్రాంత ఎస్సీ రైతులపైనే.. అట్రాసిటీ కేసులు పెట్టడాన్నీ హైకోర్టు తప్పుబట్టింది.

"ఫిర్యాదుదారు ఏ సామాజికవర్గానికి చెందినవారో నిందితులకు తెలియనప్పుడు ఆ ఫిర్యాదు ఆధారంగా ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు ఎలా పెడతారు.? ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టాలంటే ఫిర్యాదుదారు ఏ కులంవారో నిందితులకు తెలిసే ఉండాలి"-2020 ఫిబ్రవరి 12న హైకోర్టు వ్యాఖ్యలు

న్యాయస్థానాలు తప్పుపట్టినా విపక్షాలపై అట్రాసిటీ కేసుల విషయంలో వెనక్కి తగ్గని వైసీపీ ప్రభుత్వం.. సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలు ఏకంగా దళితులు, గిరిజనులపై దాడి చేసినా కనీస చర్యలు తీసుకున్నపాపానపోలేదు. ఇసుక మాఫియాను అడ్డుకుని, దాని వెనుకున్న అధికార పార్టీ నాయకులను ప్రశ్నించినందుకు.. సీతానగరం పోలీసుస్టేషన్‌లో దళిత యువకుడు ప్రసాద్‌కు ఎస్సైయే దగ్గరుండి శిరోముండనం చేయించారు. ఈ ఘటనకు మూడేళ్లు అవుతున్నా.. అధికార పార్టీలో ఉన్న నిందితుల్ని అరెస్టు చేయలేదు.

ఇక.. దళిత యువకుడు సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి శవాన్ని డోర్‌ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంతబాబును.. దళిత, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తేగానీ పోలీసులు అరెస్టు చేయలేదు. అనంతబాబును సస్పెండ్‌ చేసినట్లు.. వైసీపీ ప్రకటించినా... జైలు నుంచి విడుదలైన సమయంలో పార్టీ జెండాలతో స్వాగతం పలకడం... దేనికి సంకేతమని విపక్షాలు నిలదీశాయి.

ఇక చెరువులో చేపలు పట్టుకోనివ్వకుండా.. వైసీపీ సేవాదళ్‌ రాష్ట్ర కన్వీనర్, శ్రీశైలం ట్రస్టు బోర్డు సభ్యుడు కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి, ఆయన అనుచరుడు సురేష్‌రెడ్డి అడ్డుకున్నారంటూ కావలికి చెందిన దళిత యువకుడు కరుణాకర్‌ నెల్లూరు జిల్లా ఎస్పీకి లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నారు. జగదీశ్వర్‌రెడ్డిపై చర్యలు లేవు సరికదా.. శ్రీశైలం ట్రస్టు బోర్డు సభ్యుడిగా కొనసాగిస్తున్నారు. కొవిడ్‌ సమయంలో మాస్క్‌లు ఇవ్వలేదని ప్రశ్నించినందుకు.. దళిత డాక్టర్‌ సుధాకర్‌పై ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించిందని.. ప్రతిపక్షాలు అప్పట్లో ఆరోపించాయి. ప్రభుత్వ వేధింపులు తాళలేక మానసిక క్షోభకు గురై ఆయన చనిపోయారన్న విమర్శలు వ్యక్తమయ్యాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.