గుంటూరు జిల్లాలో మేజర్ పంచాయతీ పెదకూరపాడు ఓటర్ల జాబితాలో అనేక తప్పులు చోటు చేసుకున్నట్లు విమర్శలు వస్తున్నాయి. మృతి చెందిన వారి పేర్లు రావడం.. కొన్ని వార్డుల్లో ఒక్కొక్కరికి రెండు, మూడు ఓట్లు రావడం.. తదితర తప్పులు ఉన్నాయి. కొంతమంది సామాజిక వర్గాలు తప్పుగా నమోదయ్యాయి. ఫొటోలు సరిగా లేకపోవడం, చిరునామా, వయసులో వ్యత్యాసం వంటి అనేక తప్పులు ఉన్నాయి. పదేళ్ల కింద మృతి చెందిన వారి వివరాలూ జాబితాలో ఉండటం గమనార్హం. దీంతో ఓటర్లు గందరగోళానికి గురవుతున్నారు.
ఈ విషయమై పెదకూరపాడు ఎంపీడీవో ఎస్. రాజేశ్‌ను వివరణ కోరగా జాబితాలో మృతుల వివరాలు, డబుల్ ఎంట్రీలు ఉన్న మాట వాస్తవమేనని తెలిపారు. ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో పంచాయతీ కార్యదర్శి బీఎల్ఓలు వాటిని సరి చేసి జాబితాను ప్రిసైడింగ్ అధికారులకు అందజేస్తారని చెప్పారు.
ఇదీ చదవండి: పల్లె పోరు: కొనసాగుతున్న ఉద్రిక్తతలు..ఓ వర్గం అభ్యర్థులను బెదిరిస్తున్న ప్రత్యర్థి వర్గం