ETV Bharat / state

దిగొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం.. కానీ తూతూ మంత్రంగానే ఉద్యోగులతో చర్చలు.. - MINISTERS COMIITTEE MEETING

MINISTERS COMIITTEE MEETING WITH EMPLOYEES : వేతనాల ఆలస్యం, ఆర్థిక ప్రయోజనాలపై ఉద్యోగులు ఆందోళనకు సిద్ధమైన తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చింది. ఉద్యోగ సంఘాలతో అనధికారికంగా.. భేటీ నిర్వహించింది. మంత్రుల కమిటీతో పాటు ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి చర్చించారు. త్వరలోనే PRC సహా పెండింగ్ అంశాలపై C.S.కమిటీ చర్చించే అవకాశం ఉంది. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాన్ని మాత్రం ఈ అనధికార సమావేశానికి ఆహ్వానించలేదు.

MINISTERS COMIITTE MEETING WITH EMPLOYEES

author img

By

Published : Mar 3, 2023, 7:43 AM IST

దిగొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం.. కానీ తూతూ మంత్రంగానే ఉద్యోగులతో చర్చలు..

MINISTERS COMIITTEE MEETING WITH EMPLOYEES : ఉద్యోగుల సమస్యలపై ఈనెల 9 నుంచి ఏపీ ఐకాస అమరావతి ఉద్యోగుల సంఘం దశల వారీగా ఆందోళనకు పిలుపునివ్వడంతో.. ప్రభుత్వం హడావిడిగా ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు ప్రారంభించింది. మంత్రుల కమిటీ సభ్యులు బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహదారు సజ్జల, ఉద్యోగ సంఘాల నేతలతో విడివిడిగా భేటీ అయ్యారు. D.A. బకాయిలు, ఏపీ G.L.I సహా పెండింగ్ అంశాలపై నిర్ణయం తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

ఉద్యమ కార్యాచరణ నోటీసు ఇచ్చినందునే ప్రభుత్వం ఈ అనధికార సమావేశం నిర్వహించిందని.. ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగ సంఘం ఆరోపించింది. డీఏ బకాయిలు, వేతనాలు సకాలంలో చెల్లించకుండా.. ఉద్యోగులను చులకన చేస్తున్నారని ఆక్షేపించింది. ప్రభుత్వం లిఖిత పూర్వక హామీ ఇస్తే తప్ప.. ఈనెల 9 నుంచి నిరసన కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయని ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు.

"ఉద్యోగులకు సంబంధించిన ఆర్థిక సమస్యలను పట్టించుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చింది. పీఆర్సీని రిటైర్​మెంట్​ అప్పుడు ఇస్తామంటే ఒప్పుకున్నాం. పీఆర్సీ అలవెన్సుల మీద నిర్ణయం తీసుకోవడానికి ఐఏఎస్​ అధికారులతో కమిటీ వేశారు. ఎందుకు మమ్మల్ని చులకన చేసే విధంగా జీతభత్యాలు ఆలస్యంగా ఇస్తున్నారు. మా కోసం కేటాయించిన బడ్జెట్​ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించాం. ఉద్యమ కార్యాచరణ నిర్ణయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. అధికారికంగా పెట్టే సమావేశంలో లిఖిత పూర్వక సమాధానం ఇస్తే తప్పు మేము వెనక్కి తగ్గం"-బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ ఐకాస అమరావతి ఛైర్మన్‌

ఉద్యోగులకు ఇచ్చే అలవెన్సులపై మళ్లీ IAS కమిటీ ఏమిటీ ఏర్పాటుపై ప్రశ్నించారు. అలవెన్సులు, డీఏలను ఇప్పటికీ ఇవ్వకపోవడం ఏంటని మంత్రుల కమిటీ సభ్యులు సజ్జల, బొత్సను.. ఉద్యోగ సంఘాల నేతలు నిలదీసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం MLC ఎన్నికల కోడ్‌ ఉన్నందున డీఏ బకాయిలు తర్వాత ఇస్తామని.. కమిటీ స్పష్టం చేసినట్లు ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘం నేత వెంకట్రామిరెడ్డి తెలిపారు.

"ఒకటో తారీఖు జీతం విషయం అయితే ఏమి, మాకు సంబంధించిన జీపీఎఫ్​ సొమ్ము,మిగిలిన అంశాలపై ప్రభుత్వం నుంచి వివరణ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని మంత్రులను కోరాము. ఈ సమస్యలన్నింటిపై 7వ తారీఖులోపు వివరణ వచ్చే అవకాశం ఉంది"-బండి శ్రీనివాసరావు, ఏపీ ఐకాస ఛైర్మన్‌

CPS ఉద్యమంలో పెట్టిన కేసులు వెనక్కి తీసుకుంటారని..గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీ విషయంలోనూ ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని వివరించారు. ఉద్యోగ సంఘాలతో అనధికార సమావేశాన్ని అత్యవసరంగా నిర్వహించిన ప్రభుత్వం .. ఈ భేటీకి వేతనాలపై చట్టం కోసం గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన సూర్యనారాయణ నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాన్ని ఆహ్వానించలేదు. జాయింట్ ఆఫ్‌ స్టాఫ్ కౌన్సిల్‌లో ఉన్న వివిధ సంఘాల నేతలను చర్చలకు పిలిచి.. ఆ సంఘాన్ని ఆహ్వానించకపోవటంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.