మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలోని మహిళలకు రెండో విడత 'పసుపు-కుంకుమ' నిధులను విడుదల చేసినట్లు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. మహిళలందరికీ 'అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు' తెలిపారు. స్త్రీ శక్తిని నిరూపించుకునేందుకు' సీఎం చంద్రబాబు వారికి అవకాశం కల్పించారన్నారు. మహిళల ఆర్థికాభివృద్ధే ధ్యేయంగా తెదేపా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.
అరాచక శక్తులను అధికారంలోకి రానివ్వొద్దు...!
అరాచక శక్తులను అధికారంలోకి రానీయకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవినీతిపరులు అధికారంలోకి వస్తే అభివృద్ధి కుంటు పడుతుందని మంత్రి అన్నారు. వైకాపా నాయకులు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారని విమర్శించారు. కేంద్రీయ విద్యాలయ ఏర్పాటుకు కేంద్ర కేబినేట్ ఆమోదం తెలిపిందన్నారు. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం 10.11 ఎకరాల స్థలం కేటాయించిందని, జిల్లాలోని నాదెండ్ల మండలం ఇర్లపాడు గ్రామంలో ఈ నూతన కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు కానుందని చెప్పారు.