అమరావతిలోని అసెంబ్లీ, సచివాలయ భవనాలకు.. నారాయణ కాలేజీ భవనాలకు తేడా ఏమీ లేదని రవాణాశాఖ మంత్రి పేర్ని నాని ఎద్దేవా చేశారు. ఇరుకు గదుల నిర్మాణాలుగా ఈ భవనాలను కట్టారని ఆయన ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు లఘుశంక వస్తే మొదటి ఫ్లోర్‌కు పరిగెత్తే పరిస్థితి ఉందన్నారు. కొత్తగా వచ్చిన తనకు ఈ నిర్మాణాల పట్ల ఆశ్చర్యం వేస్తోందని విమర్శించారు. తాత్కాలిక రాజధాని కాబట్టే ఈ భవనాలను నారాయణ కళాశాలలకు ఇద్దామని అనుకున్నారని మంత్రి ఆరోపించారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు ఎప్పుడైనా ఒకేసారి 1.30 లక్షల ఉద్యోగాలను ఇచ్చారా అని ప్రశ్నించారు.
ఇది కూడా చదవండి.