అవినీతి రహిత పాలన అందించేలా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. వంద రోజుల పాలనలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలను దేశంలోనే ఏ సీఎం చెయ్యలేని విధంగా దాదాపు 85 శాతం అమలు చేశారని కొనియాడారు. ప్రజల సంక్షేమమే ప్రధాన అజెండాగా పని చేస్తున్నామని....పేదలకు,కులవృత్తిపై ఆధారపడి న వారికి గతంలో ఎన్నడు లేని విధంగా పధకాలు అమలు చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. గత ఐదు సంవత్సరాల్లో తెదేపా ప్రభుత్వం క్రింది స్థాయి నుంచి భారీ ప్రాజెక్టు ల వరకు అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. గత ప్రభుత్వం చేసిన అవినీతి వలనే ఇసుక విధానం పై ఆలస్యం జరిగిందని... ప్రస్తుతం ఇసుకను తక్కువ ధరకే ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలిపారు.
ఇవీ చూడండి