ETV Bharat / state

యాజమాన్యం నిర్లక్ష్యమైతే మాత్రం చర్యలు తప్పవు: మోపిదేవి - విశాఖ కెమికల్ గ్యాస్ లీకేజీ

విశాఖలో గ్యాస్ లీక్ ఘటన పై మంత్రి మోపిదేవి వెంకటరమణ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులను కాపాడేందుకు పోలీసులు ఎన్​డీఆర్​ఎఫ్ సిబ్బంది... అధికారులు తక్షణ చర్యలు చేపట్టారన్నారు. ప్రమాదంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తామని చెప్పారు. యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని తేలితే చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

minister mopidevi
minister mopidevi
author img

By

Published : May 7, 2020, 12:58 PM IST

విశాఖలో గ్యాస్ లీక్ ఘటన బాధాకరమని మంత్రి మోపిదేవి వెంకటరమణ రావు అన్నారు. రాష్ట్ర రాజధానిగా గుర్తింపు పొందిన.. అత్యధిక పరిశ్రమల కేంద్రంగా ఉన్న విశాఖలో విష వాయువు లీక్ అవ్వడం దురదృష్టకరమని చెప్పారు. ఘటనపై ముఖ్యమంత్రి జగన్ వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారని తెలిపారు.

ఆస్పత్రిలో ఉన్న బాధితులకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఇప్పటికే బాధితులను కాపాడేందుకు పోలీసులు ఎన్​డీఆర్ఎఫ్ సిబ్బంది, అధికారులు తక్షణ చర్యలు చేపట్టారన్నారు. ఈ ప్రమాదం పై పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తామన్నారు. యాజమాన్యం నిర్లక్ష్యం వలన జరిగితే మాత్రం చర్యలు తప్పవన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని మంత్రి తెలిపారు. మృతుల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఇవీ చదవండి:

స్టెరైన్ గ్యాస్... ఇది చాలా ప్రమాదకరం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.