గుంటూరు జిల్లాలో కృష్ణా నది దిగువ ప్రాంతాల్లో వరద ఉద్ధృతిని మంత్రి మోపిదేవి వెంకటరమణ పరిశీలించారు. జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధిలతో కలిసి పర్యటించిన మంత్రి నదీ తీరంలో ఏర్పడిన గండ్లను వెంటనే పూడ్చాలని అథికారులకు ఆదేశాలు జారీ చేశారు. వరద ముంపు నుంచి ప్రజలను కాపాడేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆయన వివరించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కునేందుకు భారీ మొత్తంలో ఇసుక బస్తాలను సిద్దం చేసినట్లు మంత్రి వెల్లడించారు. ముంపు ప్రాంతాల నుంచి ప్రజలను తరలించడానికి తగిన ఏర్పాట్లు చేసినట్లు మోపిదేవి అన్నారు.
ఇదీ చదవండి : ప్రమాద ఘంటికలు... ఆవేదనలో అన్నదాతలు