Minister KTR responded on drugs criticism: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన డ్రగ్స్ ఆరోపణల పట్ల.. మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. డ్రగ్స్ వాడినట్లు తేలకపోతే కరీంనగర్ చౌరస్తాలో చెప్పు దెబ్బలకు సిద్ధమా అని సవాల్ విసిరారు. డ్రగ్స్ పరీక్షకు రక్తం ఇవ్వడానికి సిద్ధమన్న కేటీఆర్.. అవసరమైతే జుట్టు, గోర్లు, కిడ్నీ కూడా ఇస్తానని చెప్పారు. వేట కుక్కల్లాంటి కేంద్ర సంస్థలను ఉసుగొలుపుతారని తమకు ముందే తెలుసని.. మద్యం కేసులో కవితను విచారించటంపై కేటీఆర్ స్పందించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ సుడిగాలి పర్యటన చేస్తూ.. భాజపా లక్ష్యంగా విమర్శలు సంధించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ పర్యటించారు. సెస్ ఎన్నికల్లో భాగంగా.. సిరిసిల్లలో మంత్రి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లక్ష్యంగా.. తీవ్ర విమర్శలు గుప్పించారు. డ్రగ్స్‌కు సంబంధించి బండి సంజయ్ చేసిన ఆరోపణలపై.. మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. డ్రగ్స్ పరీక్షలకు తాను సిద్ధమేనని.. నిరూపించలేకపోతే కరీంనగర్ చౌరస్తాలో చెప్పు దెబ్బలకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు.
డ్రగ్స్ పరీక్ష కోసం రక్తం ఇచ్చేందుకు సిద్ధం. అవసరమైతే జుట్టు, గోర్లు, కిడ్నీ కూడా ఇస్తా. డ్రగ్స్ వాడినట్లు తేలకపోతే చెప్పు దెబ్బలు పడతావా. కరీంనగర్ చౌరస్తాలో ఆయన చెప్పుతో ఆయన కొట్టుకుంటారా?. కరీంనగర్‌లోనే ఉంటా.. ఏ డాక్టర్‌ను తెచ్చుకుంటావో తెచ్చుకో. - మంత్రి కేటీఆర్
ఇవీ చూడండి: