ETV Bharat / state

హైదరాబాద్​లో అమెజాన్ ఎయిర్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

Minister KTR Launched Amazon Air in Hyderabad: తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్​లో అమెజాన్ ఎయిర్‌ కార్గో సేవలను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. దీంతో భారత్​లో కూడా అమెజాన్ ఎయిర్ కార్గో సేవలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

minister ktr
మంత్రి కేటీఆర్‌
author img

By

Published : Jan 23, 2023, 8:33 PM IST

Minister KTR Launched Amazon Air in Hyderabad: ప్రముఖ ఇ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ (Amazon) భారత్‌లో అమెజాన్‌ ఎయిర్‌ (Amazon Air) సేవలను ప్రారంభించింది. ఇందులో భాగంగా వస్తువులను త్వరగా డెలివరీ చేయడానికి గానూ కార్గో విమానాలను వినియోగించుకోనుంది. తెలంగాణలోని హైదరాబాద్‌లో సోమవారం జరిగిన కార్యక్రమంలో తెలంగాణ మంత్రి కేటీఆర్‌ సమక్షంలో ఈ సేవలను అమెజాన్‌ ప్రారంభించింది. దీంతో వస్తువులను రవాణా చేయడం ఈ కార్గో సేవల వల్ల సులభతరం అవుతుంది.

అమెజాన్‌ ఎయిర్‌ సేవల్లో భాగంగా మంబయి, బెంగళూరు, హైదరాబాద్‌, దిల్లీ నగరాలకు వస్తువులను త్వరతిగతిన డెలివరీ చేయడానికి గానూ బోయింగ్‌ 737-800 విమానాలను వినియోగించనుంది. ఇందుకోసం బెంగళూరుకు చెందిన క్విక్‌జెట్‌ సంస్థతో అమెజాన్‌ జట్టుకట్టింది. భారత్‌లో ఓ ఇ-కామర్స్‌ సంస్థ థర్డ్‌ పార్టీ విమానసేవలను వినియోగించుకోవడం ఇదే తొలిసారి. తొలుత 2016లో అమెరికాలో అమెజాన్‌ ఎయిర్‌ సేవలు ప్రారంభమయ్యాయి. తర్వాత యూకేకు విస్తరించారు. అమెరికా, యూకే తర్వాత ఈ సేవలను భారత్‌లో అందుబాటులోకి తీసుకురావడం గమనార్హం. భారత్‌లో ఈ సేవలను ప్రైమ్‌ ఎయిర్‌ పేరిట తీసుకొచ్చారు.

అమెజాన్‌ ఎయిర్‌ వల్ల సుమారు 11 లక్షల మంది సెల్లర్లకు మేలు చేకూరనుందని అమెజాన్‌ ప్రతినిధి అఖిల్‌ సక్సేనా తెలిపారు. డెలివరీ నెట్‌వర్క్‌ను మరింత పటిష్ఠ పరిచేందుకు మరిన్ని పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపారు. అమెజాన్‌ ఎయిర్‌ సేవలు ప్రారంభించడం పట్ల తెలంగాణ మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తంచేశారు. హైదరాబాద్‌ పట్ల అమెజాన్‌ ప్రేమ కొనసాగుతోందని ట్వీట్‌ చేశారు. అతిపెద్ద క్యాంపస్‌ను, డేటా సెంటర్‌, అతిపెద్ద ఫుల్‌ఫిల్‌మెంట్‌ సెంటర్‌ను ఇప్పటికే హైదరాబాద్‌లో అమెజాన్‌ ప్రారంభించిందని, తాజాగా అమెజాన్‌ ఎయిర్‌ సేవలనూ అందుబాటులోకి తెచ్చిందని పేర్కొన్నారు.

హైదరాబాద్​లో అమెజాన్ ఎయిర్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.