MINISTER DHARMANA MEET CM JAGAN : విశాఖలో కార్యనిర్వాహక రాజధాని కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు మంత్రి ధర్మాన ప్రసాదరావు సిద్ధమైనట్లు తెలిసింది. ఈ మేరకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసి.. తన అభిప్రాయం చెప్పారు. రాజీనామా చేసేందుకు అనుమతించాలని కోరగా.. జగన్ వారించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి. మూడు రాజధానుల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ధర్మానకు సీఎం చెప్పినట్లు పేర్కొన్నారు.
గంటపాటు జరిగిన ఈ సమావేశంలో.. విశాఖ భూఅక్రమాలపై సిట్ నివేదికలో తన పేరు ప్రస్తావనపై ముఖ్యమంత్రి జగన్‌కు ధర్మాన వివరణ ఇచ్చినట్లు తెలిసింది. మాజీ సైనికోద్యోగుల భూముల కొనుగోలులో ధర్మాన ప్రసాదరావు అక్రమాలకు పాల్పడ్డారని సిట్ నివేదికలో స్పష్టం చేసింది. అవకతవకలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. సిట్ నివేదిక దృష్ట్యా భూఅక్రమాలకు సంబంధించిన ఆరోపణలపై సీఎంకు వివరణ ఇచ్చారు.
ఇవీ చదవండి: