రాష్ట్రంలో కరోనా తగ్గి, వచ్చే ఏడాది నాటికి పరిస్థితులు అనుకూలిస్తే పరీక్షలు(exams) నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్(educational minister adimulapu suresh) వెల్లడించారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరు జడ్పీ పాఠశాలలో నాడు-నేడు పనులను(nadu-nedu works) మంత్రి పరిశీలించారు. జగనన్న విద్యా కానుకలో భాగంగా విద్యార్థులకు ఇచ్చిన ఏకరూప దుస్తులు, బూట్లను పరిశీలించారు.
కొంతమంది విద్యార్థులు తమకు బూట్ల సైజులు చాలడం లేదని మంత్రి దృష్టికి తీసుకెళ్లగా.. రెండు రోజుల్లో సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఆంగ్ల వ్యాకరణం(english grammar) గురించి విద్యార్థులకు బోధించారు. విద్యార్థులతో కలసి మధ్యాహ్న భోజనం చేశారు. నాణ్యమైన భోజనం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. విద్యారంగంలో ఏపీ.. చేపడుతున్న కార్యక్రమాలను ఇతర రాష్ట్రాలు అనుకరిస్తున్నాయని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.
ఇదీచదవండి.