ETV Bharat / state

MINING IN GUNUTR: అడ్డగోలుగా మట్టిమాఫియా ఆగడాలు.. అడిగినవారిపై దౌర్జన్యాలు - గుంటూరు జిల్లా తాజా వార్తలు

MINING IN GUNUTR: అధికార పార్టీ నేతల కనుసన్నల్లో ఉమ్మడి గుంటూరు జిల్లాలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. మైనింగ్ నిబంధనలకు విరుద్ధంగా మంచినీటి చెరువుల్లో ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారు. అడ్డూఅదుపూ లేకుండా మట్టిని కొల్లగొడుతున్నారు. ఇదేంటని ప్రశ్నించిన ప్రతిపక్షాలపై దాడులకు తెగబడుతున్నారు. యథేచ్ఛగా మట్టిని దోచేస్తున్నా యంత్రాంగం చేష్టలుడిగి చూస్తోంది.

MINING IN GUNUTR
MINING IN GUNUTR
author img

By

Published : Jun 15, 2022, 11:20 AM IST

అడ్డగోలుగా మట్టిమాఫియా ఆగడాలు

MINING IN GUNUTR: ఉమ్మడి గుంటూరు జిల్లాలో మట్టి మాఫియా ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. పల్నాడు, డెల్టా ప్రాంతం ఏదైనా సరే.. అధికారం అండగా వైకాపా నేతలు అనధికార తవ్వకాల దందా సాగిస్తున్నారు. గ్రామాల్లో మంచినీరు అందించే చెరువులు.. మైనింగ్ మాఫియా దాష్టీకాలకు కరిగిపోతున్నాయి. అడ్డగోలు తవ్వకాలను ప్రశ్నించిన గ్రామస్థులపైనా దాడులకు తెగబడుతున్నారు. ట్రాక్టర్లతో తొక్కిస్తామని, పోలీసు కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. విపక్ష ప్రజాప్రతినిధులు అక్కడికి వెళ్తే అడ్డుకుంటున్నారు. పెదకాకాని మండలం అనుమర్లపూడిలో సోమవారం మట్టి తవ్వకాల పరిశీలనకు వెళ్లిన తెలుగుదేశం నేత ధూళిపాళ్ల నరేంద్రను.. స్థానిక వైకాపా నాయకులు అడ్డగించారు. ఆయన వాహనంపైనా దాడికి పాల్పడ్డారు.

మే 24న చేబ్రోలు మండలం శేకూరులోనూ ఇదే తరహాలో నరేంద్రను అడ్డుకున్నారు. మండల పరిధిలోని 8 గ్రామాల్లో మట్టి తవ్వకాలపై ఫిబ్రవరి 10న సుద్దపల్లి క్వారీలో నిరసనకు దిగిన నరేంద్ర.. రాత్రంతా అక్కడే నిద్రించారు. ఆ తర్వాత క్వారీ స్థలాన్ని పరిశీలించిన గనులశాఖ అధికారులు.. అక్రమాలు నిజమేనని తేల్చారు. అయితే జరిమానాలతో సరిపెట్టారు. ఆ తర్వాత యథావిధిగా మట్టి మాఫియా తవ్వకాలు కొనసాగిస్తూనే ఉంది.

చుండూరు, అమర్తలూరు మండలాల్లో మే 31న పర్యటించిన మాజీ మంత్రి నక్కా ఆనందబాబు.. చెరువుల్లో మట్టి తవ్వకాలను పరిశీలించారు. ఒక్కోచోట 30 నుంచి 40 అడుగుల మేర తవ్వకాలు జరిగినట్లు గుర్తించారు. అప్పట్లో వైకాపా నేతలు ఆయన్ను అడ్డుకున్నారు. మట్టి అక్రమ తవ్వకాల పరిశీలనకు ఆనందబాబును తీసుకొచ్చారనే కక్షతో... సోమవారం అధికార పార్టీ వర్గీయులు రెచ్చిపోయారు. నక్కా లక్ష్మయ్య అనే వ్యక్తిపై తీవ్రస్థాయిలో దాడికి పాల్పడ్డారు. ఇంట్లో ఉన్న లక్ష్మయ్యను చెరువు వద్దకు తీసుకెళ్లి కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డారు. తలపై ఐదు బలమైన గాయాలైనట్లు బంధువులు తెలిపారు.

అక్రమంగా మట్టి తవ్వడాన్ని ప్రశ్నించిన ప్రత్తిపాడు మండలం వంగిపురం సర్పంచ్‌ విజయలక్ష్మి పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. ఈ నెల 11న ఆమెపై దాడి కూడా జరిగింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా అండగా ఉంటారనే నమ్మకం లేక.. ప్రాణ భయంతో మహిళా సర్పంచ్ ఊరొదిలి జల్లా కేంద్రం గుంటూరులో తల దాచుకున్నారు.

వట్టిచెరుకూరు మండలం కుర్నూతలలో మట్టి తవ్వకాలను మే 22న S.I. అడ్డుకున్నారు. ఆయనపై కత్తిగట్టిన అధికార పార్టీ నాయకులు.. ఎమ్మెల్యే ద్వారా ఒత్తిడి తెచ్చి 2రోజుల్లోనే ఎస్సైని వీఆర్‌కు పంపించారు. కొల్లూరు మండలం బొద్దులూరిపాడులో చెరువు మట్టిని సర్పంచ్ గుర్రం మురళి దగ్గరుండి తవ్విస్తున్నారు. జగనన్న కాలనీల్లో రోడ్లు వేసేందుకు, గుంతలు చదును చేయడానికి అంటూ మట్టి తవ్వకాలు చేపడుతున్న వైకాపా నేతలు.. రాళ్లింబవుళ్లు వేలాది ట్రాక్టర్లు, టిప్పర్లతో జిల్లా సరిహద్దులు దాటించేస్తున్నారు. చెరువుల్లో అడ్డగోలు తవ్వకాలతో పర్యావరణానికి ముప్పు తప్పదని, నీటి నిల్వకూ ఇబ్బందేనని నిపుణులు హెచ్చరిస్తున్నా.. మైనింగ్‌ అధికారులు మాత్రం నామమాత్రపు జరిమానాలతో చేతులు దులుపుకొంటున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.