గుంటూరు జిల్లా మంగళగిరి మండలం చినకాకాని వలస కార్మికుల శిబిరం వద్ద జార్ఖండ్ కూలీలు ఆందోళన చేశారు. తమను సొంత ప్రాంతాలకు తరలించాలంటూ నినాదాలు చేశారు. శిబిరం సిబ్బంది గేట్లకు తాళాలు వేశారు. ఆగ్రహం వ్యక్తం చేసిన వలస కార్మికులు తాము వెళ్లిపోయేందుకు అనుమతి ఇవ్వాలంటూ అరిచారు. సమాచారం అందుకున్న పోలీసులు వలస శిబిరం వద్దకు చేరుకొని కార్మికులతో చర్చలు జరిపారు. తుపాను కారణంగా ఒడిశా వైపు వెళ్లే రైళ్లకు ఆంతరాయం ఏర్పడిందని... మరో రెండు రోజుల్లో అందర్నీ పంపుతామని పోలీసులు, అధికారులు హామి ఇవ్వడంతో వలస కార్మికులు శాంతించారు.
ఇదీ చూడండి రాష్ట్రంలో 25 నైపుణ్య శిక్షణా కళాశాలలు'