ETV Bharat / state

వలస కూలీ.. బతుకు కూలి - లాక్ డౌన్​తో వలస కూలీల కష్టాలు

వారంతా రెక్కాడితేగానీ.. డొక్కాడని వలస జీవులు... ఉపాధి వెతుకులాటలో సొంతూళ్లను వదిలి వందల కిలోమీటర్ల దూరంలోని ఇతర ప్రాంతాలకు చేరుకుని కూలీనాలీ చేసుకుని బతుకీడుస్తున్నారు. వారి జీవితాలను ఇప్పుడు కరోనా లాక్‌డౌన్‌ తలకిందులు చేస్తోంది. సొంతూళ్లకు చేరుకునే అవకాశం లేక.. ఉన్న ప్రాంతాల్లో ఉండే పరిస్థితిలేక తల్లడిల్లిపోతున్నారు. చేతిలో ఉన్న కొద్దిపాటి సొమ్మూ ఖర్చయి, కూలీ పనులు లేక.. ఆహారం కోసమూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మున్ముందు ఇదే పరిస్థితి కొనసాగితే ఎలా పూట గడపాలో తెలియక వారంతా ఆందోళన చెందుతున్నారు.

migrant labours troubles due to lock down guntur
వలస కూలీల కష్టాలు
author img

By

Published : Apr 15, 2020, 11:47 AM IST

గుంటూరు జిల్లాలో మిర్చి కోతల కోసం కర్నూలు, అనంతపురం ప్రకాశం, కృష్ణా జిల్లాలతో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన దాదాపు 30 వేల మంది చిక్కుకుపోయారు. వీరిలో కొందరికి మాత్రమే పని లభిస్తోంది. అత్యధిక శాతం మంది ఖాళీగా ఉంటున్నారు. వీరంతా పిల్లల్ని, వృద్ధులైన తల్లిదండ్రుల్ని గ్రామాల్లో వదిలి వలస వచ్చారు. అప్పుడప్పుడూ వారి సొంత గ్రామాలకు వెళ్లి తాము సంపాదించిన కూలీ డబ్బులతో సరకులు కొని వారికి అందించి, బాగోగులు చూసి తిరిగి వస్తుంటారు. లాక్‌డౌన్‌తో ఆ అవకాశం లేకుండాపోయింది.

అత్యధిక శాతం మంది రైతుల పొలాల్లో గుడారాలు వేసుకుని ఇబ్బందుల మధ్యే జీవిస్తున్నారు. నిత్యావసరాలు సమకూర్చుకునేందుకూ డబ్బులు లేక.. దాతలు, స్వచ్ఛంద సంస్థలు అందించే సాయంతో గడుపుతున్నారు. కొన్ని చోట్ల రైతులే వీరికి భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. పోర్టబిలిటీ విధానం ద్వారా కొంతమంది రేషన్‌ సరకులు తీసుకోగలిగారు. వట్టిచెరుకూరు మండలంలో 6 వేల మంది, ప్రత్తిపాడు మండలంలో 6,450 మంది, గురజాల మండలంలో 5 వేల మంది, బొల్లాపల్లి మండలంలో 3,963 మంది మేడికొండూరు మండలంలో 2,600 మంది ఇలా ఎక్కడ చూసినా వేల మంది వలస కూలీల కష్టాలే కనిపిస్తున్నాయి.

ఇటుక బట్టీల్లో పనిచేసేందుకు విజయనగరం జిల్లా నుంచి వచ్చిన దాదాపు 200 మంది కూలీలు వీరవాసరం మండలంలో ఇరుక్కుపోయారు. బట్టి యజమానులు చేసిన సాయంతో ఇన్నాళ్లు గడిపిన కూలీలు.. ఇప్పుడు చేతిలో డబ్బులు లేక నిత్యావసరాలు కొనేందుకూ ఇబ్బంది పడుతున్నారు. మరికొన్ని రోజుల పాటు లాక్‌డౌన్‌ కొనసాగనున్న నేపథ్యంలో... రాబోయే రోజుల్లో ఎలా గడపాలో? తిండి ఎలా సమకూర్చుకోవాలో తెలియక ఆందోళన చెందుతున్నామని అప్పలరాజు అనే కార్మికుడు వాపోయారు.

  • కడప జిల్లా రైల్వేకోడూరులో వ్యవసాయ, భవన నిర్మాణ పనులు, హమాలీ పనులు చేసుకునే కర్నూలు, అనంతపురం వలస కూలీలు 200 మంది వరకూ అక్కడ చిక్కుకుపోయారు.
  • గ్యాస్‌స్టవ్‌ల మరమ్మతులు, కత్తులు సానపెట్టటం తదితర పనులు కోసం గుంటూరు జిల్లా వినుకొండ ప్రాంతం నుంచి తూర్పుగోదావరి జిల్లాకు వచ్చిన దాదాపు 40 మంది అక్కడ ఉండిపోయారు. వీరికి ఎలాంటి సాయమూ అందట్లేదు.
  • గ్యాస్‌పైపులైను పనులు చేపట్టటం కోసం వచ్చిన 90 మంది విశాఖ జిల్లా వలస కూలీలు అమలాపురంలో ఇరుక్కుపోయారు. సాయం కోసం ఎదురుచూస్తున్నారు.

పిల్లలు ఎలా ఉన్నారో?

'ఇటుక బట్టీలో పనిచేసేందుకు నా భర్తతో కలిసి రెండు నెలల కిందట విజయనగరం నుంచి వచ్చాను. నాకు ఎనిమిదేళ్ల లోపు పిల్లలు ముగ్గురు ఉన్నారు. వీరిని బంధువుల వద్ద విడిచిపెట్టి వచ్చా. కరోనా వల్ల మాకు పనులు లేకుండా పోయాయి. చేతిలో ఒక్క రూపాయైనా లేదు. ఇంటికెళ్లిపోదామంటే అవకాశం లేదు. పిల్లలు ఎలా ఉన్నారో? ఏం చేస్తున్నారో? చాలా బాధేస్తోంది. ఎన్నాళ్లు ఈ కష్టాల్లో తెలియట్లేదు. '---ఈశ్వరమ్మ, వీరవాసరం ఇటుక బట్టీ కూలీ

పొగాకు పొలాల్లో పనిచేసేందుకు గుంటూరు, ప్రకాశం జిల్లాల నుంచి వచ్చిన సుమారు 3 వేల మంది వలస కూలీలు పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, బుట్టాయిగూడెం తదితర ప్రాంతాల్లో ఉండిపోయారు. నిత్యావసర సరకులు సమకూర్చుకునేందుకూ డబ్బులు లేక.. దాతలు, రైతులు అందించే సాయంతో నెట్టుకొస్తున్నారు.

శ్రీకాకుళం, విజయనగరం, కర్నూలు, అనంతపురం, కడప తదితర ప్రాంతాలకు చెందిన దాదాపు వెయ్యిమందికి పైగా వలస కార్మికులు ప్రకాశం జిల్లా చీమకుర్తి గ్రానైట్‌ క్వారీల్లో పనిచేస్తున్నారు. ప్రస్తుతం వీరంతా మేస్త్రీల వద్ద తలదాచుకుంటున్నారు. వారందించే సాయంతోనే గడుపుతున్నారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన 5 వేల మంది వలస కూలీలు నెల్లూరు జిల్లాలో ఇబ్బందులు పడుతున్నారు.

ఇదీ చదవండి:

బయటకి వచ్చారో ఆ రాక్షసుడి చేతిలో చచ్చారే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.