ETV Bharat / state

MIG Layouts: సీఆర్‌డీఏ ఆధ్వర్యంలో ఎంఐజీ లేఅవుట్లు.. 13న ప్రారంభించనున్న సీఎం జగన్‌ - సీఆర్‌డీఏ ఆధ్వర్యంలో ఎంఐజీ లేఅవుట్లు

MIG Layouts under CRDA: జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌ పథకం కింద ఎంఐజీ లేఅవుట్లను సీఎం జగన్‌ ఈ నెల 13న ప్రారంభించనున్నారు. ఇందుకోసం మంగళగిరిలోని ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ స్టేడియం సమీపంలోని అమరావతి టౌన్‌షిప్‌లో దాదాపు 600 వరకు ప్లాట్లను అందుబాటులోకి తెస్తున్నారు. వీటిని ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారే కొనుగోలు చేసేందుకు అర్హులని సీఆర్‌డీఏ కమిషనర్ విజయకృష్ణన్‌ స్పష్టం చేశారు.

MIG Layouts under CRDA
MIG Layouts under CRDA
author img

By

Published : Jan 7, 2022, 9:14 AM IST

MIG Layouts under CRDA: జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌ పథకం కింద ఎంఐజీ లేఅవుట్లను 13న మంగళగిరిలోని ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ స్టేడియం సమీపంలోని అమరావతి టౌన్‌షిప్‌లో సీఎం జగన్‌ ప్రారంభించనున్నారు. ఇందులో దాదాపు 600 వరకు ప్లాట్లను అందుబాటులోకి తెస్తున్నారు. దరఖాస్తు, కేటాయింపులు ఆన్‌లైన్‌ ద్వారా చేస్తారు. ఒక్కొక్కటి 200 చ.గజాల నుంచి 240 చ.గజాల వరకు ఉంటుందని సీఆర్‌డీఏ కమిషనరు విజయకృష్ణన్‌ ఓ ప్రకటనలో తెలిపారు. కుటుంబ సభ్యుల అందరి ఆదాయం సంవత్సరానికి రూ.18 లక్షల లోపు ఉండి.. ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారే కొనుగోలు చేసేందుకు అర్హులని స్పష్టం చేశారు.

ఆదాయాన్ని ధ్రువీకరించే ఐటీ రిటర్నులు, ఫారం16, తహశీల్దారు జారీ చేసిన పత్రాన్ని సమర్పించాల్సి ఉంది. దరఖాస్తు సమయంలో విలువలో 10 శాతం చెల్లించాలి. కేటాయింపు అయిన నెలలోపే ఒప్పందం ఉంటుంది. ఇది జరిగిన నెలలోగా 30 శాతం, 6 నెలలకు మరో 30 శాతం, ఏడాదికి కానీ.. రిజిస్ట్రేషన్‌ సమయంలో కాని మిగిలిన 30 శాతం మొత్తాన్ని చెల్లించాల్సి ఉంది. వివరాలకు సీఆర్‌డీఏ కేంద్ర కార్యాలయంలో కానీ https://migapdtcp.ap.gov.in, https:// crda.ap.gov.in సైట్లలో కానీ వివరాలను తెలుసుకోవచ్చని కమిషనరు విజయకృష్ణన్‌ వివరించారు.

ఇదీ చదవండి: POLAVARAM DAM : పోలవరం ప్రాజెక్టు...నిర్మాణం పూర్తయ్యేదెన్నడు...?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.