రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన తెనాలి రైల్వే స్టేషన్ లో జరగింది. గుంటూరు జిల్లా తెనాలిలో గుర్తు తెలియని వ్యక్తి (35)రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడని రైల్వే పోలీస్ అధికారులు తెలిపారు. ఛిద్రమైన మృతదేహాన్నిస్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: రైలు పట్టాలపై: ప్రాణం తీసుకునేందుకు ఒకరు.. కాపాడేందుకు మరొకరు..