గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ ప్రారంభించారు. ఎమ్మెల్యే విడదల రజనీతో కలిసి పట్టణంలోని సుభానినగర్‌లో ఉన్న వార్డు సచివాలయం, ఏఎమ్‌జీ కళాశాలలో వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను ప్రారంభించారు. కొవిడ్ మహమ్మారిని పారద్రోలేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా శనివారం ఒక్కరోజు 1.68 లక్షల మందికి వ్యాక్సిన్ వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ప్రజలందరూ తమ దగ్గరలోనే వ్యాక్సిన్ కేంద్రాలకు వెళ్లి వ్యాక్సిన్లు వేయించుకోవాలని సూచించారు. వ్యాక్సిన్ వేసుకున్నప్పటికీ ప్రజలందరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు.
ప్రజలందరూ స్వచ్ఛందంగా వచ్చి వ్యాక్సిన్లు వేయించుకోవాలని ఎమ్మెల్యే విడదల రజని అన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి యాస్మిన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: